Warangal

News July 19, 2024

వరంగల్: నేడు భారీ వర్షం

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేడు భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. MHBD, MLG జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, HNK, WGL, BHPL ఆరెంజ్‌, జనగామకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గ్రేటర్ వరంగల్‌లో వరద ముంపు, వర్షపు నీళ్ల ఆగడం తదితర సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 1980, సెల్‌ నంబరు 97019 99645 సంప్రదించాలని కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ప్రకటనలో కోరారు.

News July 18, 2024

ములుగు: రిజిస్టర్ కార్యాలయంలో మతాంతర వివాహం

image

ములుగు జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో తెలంగాణ బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన కుమారుడు భరత్, తస్లీమ్‌లకు ఆదర్శ వివాహాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్ బిక్షపతి హాజరై మాట్లాడుతూ.. మతాంతర వివాహం చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. నేటి సమాజంలో వరకట్న వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఆదర్శ వివాహం చేసుకోవడం హర్షనీయమన్నారు.

News July 18, 2024

ప్రజాసేవకు విరమణ ఉండదు: కడియం

image

చిల్పూర్ మండల కేంద్రంలో గురువారం ఎంపీపీ, ఎంపీటీసీల పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవికి విరమణ ఉంటుంది తప్ప.. ప్రజాసేవకు విరమణ ఉండదని అన్నారు. పదవీ కాలం ముగిసిన ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. ఎంపీపీ, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు.

News July 18, 2024

ములుగు DMHOను అభినందించిన మంత్రి రాజనర్సింహ

image

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ములుగు <<13649861>>DMHO <<>>డా.అల్లెం అప్పయ్యకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి, కొండలు ఎక్కి, వాగులు దాటి ఆదివాసీలకు వైద్యసేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. ములుగు DMHOను ఆదర్శంగా తీసుకుని ఇతర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలతో పాటు గిరిజనులకు వైద్యసేవలు అందించాలని కోరారు.

News July 18, 2024

రైతులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నాం: కొండా సురేఖ

image

WGL: ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నామని రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయమని, రాష్ట్రంలోని రైతుల తరఫున సీఎంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు.

News July 18, 2024

నర్సంపేట: అరుణాచలానికి ఆర్టీసీ బస్సు

image

అరుణాచలంలో ఈనెల 21న గురు పౌర్ణమి సందర్భంగా HNK నుంచి ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు నర్సంపేట RTC DM లక్ష్మి తెలిపారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు HNK నుంచి బయల్దేరుతుందన్నారు. ఈ బస్సు సర్వీసులో కాణిపాక వరసిద్ధి వినాయక, వేలూరు మహాలక్ష్మి అమ్మవారు, జోగులాంబ అమ్మవారి దర్శన అవకాశం ఉంటుందని తెలిపారు. NSPT ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 18, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ ఏసీ మిర్చి క్వింటాకు రూ. 17వేల ధర పలకగా.. 341 రకం మిర్చి రూ.16వేలు పలికింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చికి రూ. 14వేల ధర వచ్చింది. అయితే మొన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు తగ్గాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

News July 18, 2024

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మహిళల మార్క్

image

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మహిళలు మార్క్ చూపిస్తున్నారు. కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారదాదేవి, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా సహా రెండు జిల్లాల్లో ఇతర ముఖ్య అధికారులు మహిళలే కావడం విశేషం. రాణి రుద్రమదేవి పరిపాలించిన వరంగల్ నగరంలో మహిళా అధికారులు అంకితభావంతో సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ తమ మార్క్ చూపిస్తున్నారు.

News July 18, 2024

WGL: పతనమైన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు పతనమవుతూ వస్తుంది. ఈ క్రమంలో గత రెండు రోజులతో పోలిస్తే పత్తి ధర ఈరోజు తగ్గింది. సోమవారం రూ.7,310 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7,350కి చేరింది. నిన్న మార్కెట్ బంద్ ఉండగా.. ఈరోజు ప్రారంభమై రూ.7,235కి పడిపోయింది. దీంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

News July 18, 2024

పర్వతగిరి: బాలిక మృతిపై కీలక UPDATE

image

పర్వతగిరి మండలంలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. SI వెంకన్న వివరాలు.. ఇంటర్ చదువుతున్న G.ఐశ్వర్య(16) కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందగా.. అందుకు M.ఛత్రపతి అనే వ్యక్తి కారణమని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మెడకు ఉరేసుకున్నట్లు, మృతదేహం పక్కన చీర పడి ఉంది. ఛత్రపతికి ఐశ్వర్యకు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిందని SI తెలిపారు.