Warangal

News November 5, 2024

రాహుల్ గాంధీని కలిసిన మంత్రి కొండా సురేఖ

image

హైదరాబాద్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లతో కలిసి మంత్రి కొండా సురేఖ కలిశారు. అనంతరం పలు అంశాలపై రాహుల్ గాంధీ, నేతలతో మంత్రి కొండా సురేఖ చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్ మున్సి, తదితరులు ఉన్నారు.

News November 5, 2024

WGL: KU ఫీజు చెల్లింపునకు రేపే ఆఖరు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు రేపటితో ముగియనున్నట్లు KU అధికారులు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

News November 5, 2024

మాల విరమణకు బయలుదేరిన నాగేంద్ర స్వామి మాలధారణ స్వాములు

image

గీసుకొండ మండలంలోని నాగేంద్ర స్వామి దేవాలయంలో 41 రోజుల మండల దీక్షలు తీసుకున్న నాగేంద్ర స్వామి భక్తులు నాగుల చవితి సందర్భంగా ఈరోజు మాలవిరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులు పాల కావడులతో ఊరేగింపుగా తిరిగి మంగళ వాయిద్యాలతో దేవాలయానికి చేరుకున్నారు. నాగేంద్ర స్వామి దేవాలయం హరోం హర అనే నినాదాలతో మార్మోగింది.

News November 5, 2024

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం తేజ మిర్చి క్వింటాకు రూ.16,700 ధర రాగా నేడు రూ. 16,800 ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ మిర్చికి నిన్న రూ. 14,500 ధర రాగా, ఈరోజు రూ.15వేల ధర పలికింది. మరోవైపు 341 రకం మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.15 వేల ధర వచ్చిందని అధికారులు తెలిపారు.

News November 5, 2024

భూసేకరణ తదితర అంశాలపై మంత్రుల సమీక్ష

image

ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో వరంగల్, హనుమకొండ జిల్లాల అభివృద్ధి, వరంగల్ ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ లకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, పలువురు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News November 5, 2024

WGL: పంపకాల్లో హెడ్ కానిస్టేబుళ్ల మధ్య గొడవ.. బదిలీ వేటు

image

ఓ ఫిర్యాదుదారుడి వద్ద తీసుకున్న డబ్బు విషయంలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల మధ్య ఘర్షణ తలెత్తిన ఘటన వెలుగులోకి రావడంతో వారిపై బదిలీ వేటు పడింది. WGL జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న మోహన్ నాయక్, సోమ్లా నాయక్ ఒక కేసులో ఓ వ్యక్తి నుంచి తీసుకున్న డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. దీనిపై సీఐ చంద్రమోహన్ విచారణ చేపట్టారు. వారిద్దరిని వేర్వేరు స్టేషన్లకు బదిలీ చేశారు.

News November 5, 2024

వరంగల్ నుంచి పుష్ పుల్ రైలు 

image

పుష్‌పుల్ (07463) రైలును రెండేళ్ల తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్‌ వరకు పొడిగించారు. గతంలో ఈ రైలు వరంగల్- సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్న సమయంలో నడిచేది. అయితే మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా 2 సం.ల నుంచి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. దీంతో వరంగల్ నుంచి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు.. తాజాగా పుష్‌పుల్ రైలును వరంగల్‌కు పొడిగించారు.

News November 5, 2024

భీమదేవరపల్లి: బస్టాండులో భార్య కళ్లెదుటే భర్త మృతి

image

HNK జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామానికి చెందిన కూన పోచయ్య (45) ముల్కనూరు బస్టాండులో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. 3 రోజుల క్రితం పోచయ్య భార్య రేణుక పండగకు తల్లిగారింటికి వెళ్లగా.. మద్యం తాగుతూ అప్పటి నుంచి బస్టాండులోనే ఉంటున్నాడు. సోమవారం అతడి భార్య ఇంటికి తీసుకువెళ్లేందుకు బస్టాండ్ వద్దకు వచ్చింది. నీళ్లు తాగించి నిమ్మరసం కోసం పక్కకు రాగానే కిందకు ఒరిగి మృతి చెందాడు.

News November 5, 2024

వరంగల్ డీఈవోకు విద్యాశాఖ షోకాజ్ నోటీసు

image

వరంగల్ డీఈవో ఎం.జ్ఞానేశ్వర్‌కు విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహ రెడ్డి సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీఈవో కార్యాలయంలో సంబంధం లేని వ్యక్తిని సత్కరించినందుకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటు తాఖీదు ఇచ్చారు. వరంగల్ జిల్లా విద్యాశాఖతో సంబంధం లేని వ్యక్తిని అక్టోబర్ 30న వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి ఛాంబర్‌లో సత్కరించడం ప్రవర్తనా నియమాలకు విరుద్ధమని నోటీస్‌లో పేర్కొన్నారు.

News November 4, 2024

కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టు అంచనా రూ.680 కోట్లకు పెరిగింది: కిషన్ రెడ్డి

image

కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.680 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం రైల్వే అధికారులతో చర్చించిన అనంతరం మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. సోమవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో ఏటా దాదాపు 600ల రైల్వే కోచ్‌లు తయారవుతాయని వెల్లడించారు.