India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హసన్‌పర్తి మం.లోని ఆరెపల్లికి చెందిన చందన అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. చందనకు అదే గ్రామానికి చెందిన జంపన్నతో గతేడాది ప్రేమ వివాహం జరిగింది. అయితే పెళ్లయిన 3 నెలల తర్వాత వరకట్నం కోసం భర్త, అత్తమామ, ఆడబిడ్డ వెంకటమ్మ మానసికంగా వేధించేవారు. దీంతో ఈనెల 7న పురుగు మందు తాగగా KNR ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఉన్న బొగతా జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. వరుసగా వర్షాలు కురవడంతో జలపాతానికి భారీగా వరద వచ్చి చేరుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకురాలు బొగతా జలపాతం పక్కన నీటిలో స్నానాలు చేస్తూ సందడి చేస్తున్నారు. బొగత అందాలకు మంత్రముగ్ధులై సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు మత్తడి పోస్తున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే హన్మకొండ జిల్లా నడికుడ మండలం కంఠాత్మకుర్‌లో వాగు తెగింది. దీంతో HNK ఎర్రగట్టు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
గృహజ్యోతి పథకం వర్తించక ఉమ్మడి WGL జిల్లా వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో వివరాలను తప్పుగా నమోదు చేయడమే దీనికి కారణమని, కరెంట్ బిల్ కట్టాల్సి వస్తుందని మండిపడుతున్నారు. గతేడాది DEC నుంచి ఈ ఏడాది జనవరి 6 వరకు జిల్లా వ్యాప్తంగా 11,89,692 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల తప్పులను సరిదిద్దడానికి MPDO, పురపాలక ఆపీస్‌లకు వెళ్లాలని MHBD విద్యుత్‌శాఖ SE నరేశ్ తెలిపారు.
ఏడో తరగతి చదివే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి దర్గా కాజీపేటలో చోటుచేసుకుంది. ఎస్సై వై.సుధాకర్ రెడ్డి వివరాల ప్రకారం.. బాలిక(13) ఓ ప్రైవేటు పాఠశాల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. రాత్రి 7:30 సమయంలో తల్లి బయటకు వెళ్లి వచ్చిన అరగంటలో ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
రాష్ట్ర పురపాలకశాఖ వరంగల్ ప్రాంతీయ సంచాలకులు షాహిద్ మసూద్ ఆధ్వర్యంలో నేడు గ్రేటర్ వరంగల్ సాధారణ పరిపాలన విభాగం ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ జరగనుంది. HNKలోని ‘కుడా’ కాంప్లెక్సులో ఉదయం 9గంటలకు సీనియర్ అసిస్టెంట్లు, మధ్యాహ్నం 12గంటలకు సీనియర్ అకౌంటెంట్స్, మధ్యాహ్నం 1గంటకు హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని వరంగల్ ప్రాంతీయ ఉప సంచాలకులు షాహిద్ మసూద్ షెడ్యూల్ విడుదల చేశారు.
హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. ఈరోజు ఉదయం రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాల సేకరణ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఫిర్యాదులు అందించేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు.
గుజరాత్‌కు చెందిన పరుశురాం, రజనీత్ భాయ్‌పాల్‌తో పాటు మరో ఐదుగురు 2022లో అర్మడా బజార్ అనే షాపింగ్ మార్ట్‌ను స్థాపించారు. పాలకుర్తిలో ఫ్రాంచైజీ ఏర్పాటు చేస్తామని చెప్పి పాలకుర్తికి చెందిన ఓ ముగ్గురి దగ్గర రూ.30 లక్షలు తీసుకొని ఫ్రాంచైజీ పెట్టకుండా ఢిల్లీకి పారిపోయారని బాధితులు వాపోయారు. వారి ఫిర్యాదుతో పాలకుర్తి పోలీసులు ప్రధాన నిందితుడు భీమ్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రేపు హనుమకొండకు రానున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ సమీకృత జిల్లా కార్యాలయ సమూహం (ఐడీవోసీ)లో రైతు భరోసా పై వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వారితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, సీతక్క పాల్గొననున్నట్లు తెలిపారు.
ఇటలీ దేశానికి చెందిన జెన్నీ, డానియల్‌లు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని ఆదివారం సందర్శించారు. నిర్మాణశైలిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నంది విగ్రహం వద్ద ఫోటో తీయించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
Sorry, no posts matched your criteria.