India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రేపు హనుమకొండకు రానున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ సమీకృత జిల్లా కార్యాలయ సమూహం (ఐడీవోసీ)లో రైతు భరోసా పై వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వారితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, సీతక్క పాల్గొననున్నట్లు తెలిపారు.
ఇటలీ దేశానికి చెందిన జెన్నీ, డానియల్‌లు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని ఆదివారం సందర్శించారు. నిర్మాణశైలిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నంది విగ్రహం వద్ద ఫోటో తీయించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ, వీఎల్ఈ)ల కమిటీ గౌరవ అధ్యక్షుడిగా పాలకుర్తికి చెందిన మాసంపల్లి నాగయ్య, సహాయ కార్యదర్శిగా రాపోలు లక్ష్మణ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని కామన్ సర్వీస్ సెంటర్ కార్యాలయంలో వీఎల్ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభం కానుంది. శని ఆదివారం సెలవులు కావడంతో మార్కెట్ బంద్ అయింది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం అవుతాయి.
నల్లబెల్లి మండలం నారక్క పేట గ్రామానికి చెందిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఇటివల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శ్రీనివాస్ చిత్రపటానిక ఎస్సై బ్యాచ్‌మేట్స్ (2014 SI బ్యాచ్) ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్‌లో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఝాన్సీరెడ్డి బోనం ఎత్తుకొని సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని ఝాన్సీరెడ్డి ఆకాంక్షించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాల నియంత్రణకై WGL పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు WGL పోలీస్ కమిషనర్ వెల్లడించారు. దేశ భవిష్యత్తు అయిన యువతతో పాటు విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడకుండా, గంజాయి లాంటి మత్తుపదార్థాల అక్రమ రవాణాతో పాటు విక్రయాలకు పాల్పడుతున్న నేరగాళ్లపై ఉక్కుపాదాన్ని మోపి తద్వారా కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకై డ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటు చేశామన్నారు సీపీ తెలిపారు.
తమిళనాడులోని అరుణాచల దేవాలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం వరంగల్ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈనెల 19నుంచి 22 వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని, ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
బల్దియా క్షేత్రస్థాయి, మినిస్ట్రీ రియల్ ఉద్యోగుల బదిలీ జాబితా సిద్ధమైంది. ఈనెల 20లోగా 40 శాతం ఉద్యోగులు ఇతర మున్సిపాలిటీలకు వెళ్లనున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. ఈ సమాచారాన్ని ప్రాంతీయ సంచాలకు షహీద్ మసూద్‌కు పంపించారు. 16 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్, మరో 10 మంది నాలుగో తరగతి ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.