Warangal

News July 14, 2024

WGL: మహిళా కండక్టర్‌ను దూషించిన ప్రయాణికుడిపై కేసు

image

మహిళా కండక్టర్‌ను దూషించిన ఓ ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ దుర్గా హుస్సేన్ కూతురితో కలిసి ఖమ్మం నుంచి తొర్రూర్‌కు వెళ్లే RTC బస్సు ఎక్కారు. అయితే టికెట్ తీసుకునే క్రమంలో కూతురు ఆధార్ కార్డును ఫోన్‌లో చూపించింది. దీంతో ఒరిజినల్ కార్డు చూపించాలని, లేదంటే టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పడంతో హుస్సేన్ ఆగ్రహంతో కండక్టర్‌ను దూషించాడు. 

News July 13, 2024

ఏటూరునాగారంలో ఘోర ప్రమాదం.. పరారీలో కంటైనర్ డ్రైవర్

image

ఏటూరునాగారం మండలం జాతీయ రహదారిలోని హైవే ట్రీట్ వద్ద శనివారం రాత్రి ఆటో, కంటైనర్ ఢీకొనగా<<13623871>> ముగ్గురు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమైన కంటైనర్ వాహనాన్ని ప్రమాద స్థలం వద్ద డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. కాగా వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ వద్ద స్థానికులు కంటైనర్‌ను పట్టుకున్నారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు వాజేడు ఎస్సై హరీశ్ తెలిపారు.

News July 13, 2024

HNK: బాలికల గురుకులంలో కొండ చిలువల కలకలం

image

HNK జిల్లా పరకాల మండలం మల్లక్కపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కొండ చిలువ పిల్లలు కనిపించడం కలకలం రేపింది. శనివారం గురుకులంలో కొండ చిలువ పాములను చూసిన విద్యార్థినులు ఆందోళన చెందారు. అటవీ అధికారులకు సమాచారం అందించగా.. మొత్తం 12 కొండ చిలువ పిల్లలను గురుకులంలో గుర్తించారు. ఆరు పాములను చంపేసినట్లు సమాచారం. పిచ్చి చెట్లను తొలగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

News July 13, 2024

ఏటూరునాగారం: ఆటోను ఢీకొన్న కంటైనర్.. ముగ్గురి మృతి

image

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధిలోని హైవే ట్రీట్ ఫంక్షన్ హాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగారం వైపు వస్తున్న ఓ కంటైనర్ ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్సు ద్వారా తరలించారు. ఆటో వాజేడు మండలానికి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 13, 2024

కాళీ క్రమంలో ఉగ్ర నిత్యగా భద్రకాళి అమ్మవారి అలంకరణ

image

వరంగల్ భద్రకాళి ఆలయంలో శాఖాంభరి ఉత్సవాలు నేటితో ఎనిమిదో రోజుకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారు ప్రాతఃకాల విశేష దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే కాళీ క్రమంలో ఉగ్ర నిత్యగా భద్రకాళి అమ్మవారిని అలంకరించి, విశేష పూజలు చేస్తున్నారు. నేడు వారాంతం కావడంతో దేవాలయానికి భక్తులు తరలివస్తున్నారు.

News July 13, 2024

WGL-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. UPDATE

image

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. మామునూరు జ్యోతిబాఫులే పాఠశాల ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొని <<13619400>>హోంగార్డు సుధాకర్<<>> దుర్మరణం చెందారు‌. ప్రమాద పరిస్థితిని చూస్తే ఓవర్ లోడ్‌తో వెళ్తున్న లారీ గుద్దినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుధాకర్ శరీరం పూర్తిగా నుజ్జు నుజ్జయ్యింది . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 13, 2024

బొగత జలపాతం వెళ్లే వారికి సీఐ కీలక సూచన

image

వాజేడు మండలం బొగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులకు సీఐ కుమార్ కీలక సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో జలపాతంలో వరద పెరుగుతుందని హెచ్చరించారు. పర్యాటకులు లోతైన ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. గతంలో అనేకమంది భోగత జలపాతంలో మునిగి మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News July 13, 2024

బోగత జలపాతం వెళ్ళేవారికి సీఐ కీలక సూచన

image

వాజేడు మండలం బోగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులకు సీఐ కుమార్ కీలక సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో జలపాతంలో వరద పెరుగుతుందని హెచ్చరించారు. పర్యాటకులు లోతైన ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. గతంలో అనేకమంది భోగత జలపాతంలో మునిగి మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News July 13, 2024

BREAKING.. WGL: రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

image

మామునూరులో జ్యాతిబాఫులే పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని హోంగార్డు సుధాకర్ మృతి చెందాడు. మామునూరు పీఎస్‌లో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 13, 2024

వరంగల్: రూ.3 కోట్లు మోసం.. వ్యక్తి అరెస్ట్

image

వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామానికి చెందిన మధుకర్ అనే వ్యాపారిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దాదాపు దశాబ్ద కాలంగా శ్రీ కనకమహాలక్ష్మీ ట్రేడర్ పేరుతో వ్యాపారుల నుంచి రూ.3 కోట్లు మోసం చేసినట్లు బాధితుడు జూలూరి కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.