Warangal

News June 1, 2024

వరంగల్: ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. వరంగల్, MHBD పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికే వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!

News June 1, 2024

ములుగు: మూడేళ్లకే.. నూరేళ్లు నిండాయి

image

రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మంగపేటలో జరిగింది. స్థానిక ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మోట్లగూడెం చెందిన నగేశ్ ద్విచక్ర వాహనంపై చిన్నారి ఆద్య(3)ను తీసుకొని మంగపేట వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో రమణక్కపేట శివారులో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.

News June 1, 2024

వరంగల్: భానుడి సెగలు.. రోడ్లన్నీ నిర్మానుష్యం

image

వరంగల్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. దాదాపు ప్రతీ మండలంలోనూ 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. పందులు మేపడానికి వెళ్లి చెన్నారావుపేటకు చెందిన బలయ్య వడదెబ్బకు గురై మృతిచెందాడు. కొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతవరణ అధికారులు చెబుతున్నా, ప్రస్తుతం మాత్రం సూర్యుడి దెబ్బకు జనాలు విలవిల్లాడుతున్నారు. వరంగల్ నగరంతో పాటు వర్ధన్నపేట, నర్సంపేట రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

News May 31, 2024

చెన్నారావుపేట: వడదెబ్బతో ఒకరు మృతి

image

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో వడదెబ్బతో ఒకరు మృతిచెందారు. చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య రెండు రోజులుగా కూలీ పనులకు వెళ్లగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా చికిత్స అందించినప్పటికి శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఐలయ్య మృతదేహానికి ఏకలవ్య సంఘం నాయకులు నివాళులర్పించి, బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించారు.

News May 31, 2024

కేయూ ఉద్యోగులపై కేసు నమోదు..?

image

కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల నియంత్రణ విభాగంలో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బందిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కేయూ పరిధిలో జరిగిన డిగ్రీ పరీక్షల జవాబు పత్రాల సీల్ తెరచి, మళ్ళీ విద్యార్థులతో పరీక్షలు రాయించి గుట్టుచప్పుడుగా సీల్ వేస్తున్నట్లు కొందరు సిబ్బంది గుర్తించారు. ఇదే విషయాన్ని పరీక్షల నియంత్రణ అధికారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేయూ పోలీసులకు ఫిర్యాధు చేసినట్లు సమాచారం.

News May 31, 2024

WGL: ప్రాణం తీసిన క్షణికావేశం!

image

వరంగల్ జిల్లాలో ఒకే వారంలో ఇద్దరు బాలురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. MHBD జిల్లా గంగారం మండలానికి చెందిన హర్షవర్ధన్, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన సిద్ధూ.. తొమ్మిదేళ్ల వయసువారే. ఒకరు హెయిర్ కటింగ్ నచ్చలేదని చనిపోతే, మరొకరు ఎండలో ఆడుకోవద్దన్నందుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దంటే.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని పలువురు సూచిస్తున్నారు.

News May 31, 2024

చెన్నారావుపేట: కుటుంబ కలహాలతో వ్యకి సూసైడ్

image

కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌లో చోటుచేసుకుంది. తిమ్మరాయినిపహాడ్‌కు చెందిన దాసరి బాలస్వామి(47) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంట్లో తరుచు గొడవల కారణంగా ఆయన మద్యానికి బానిసయ్యాడు. దీంతో బాలస్వామి భార్య తన ఇద్దరు పిల్లలకు తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News May 31, 2024

WGL: ఈ ఫుడ్ తింటే బెడ్డే

image

WGL నగరంలోని పలు ఖరీదైన రెస్టారెంట్లలో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీళ్లో బూజుపట్టిన చికెన్, బొద్దింకలతో కూడిన ఇండ్లీ పిండి, ఈగల చెట్నీ, కుళ్లిన గుడ్లు, కూరగాయలు వెలుగు చూశాయి. దీంతో అధికారుల పర్యవేక్షణ లేక యాజమాన్యాలు ఇష్టారీతిన ఆహారం తయారు చేస్తూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఫుడ్ తింటే బెడ్ ఎక్కడం ఖాయమని ప్రజలు ఫైర్ అవుతున్నారు.

News May 31, 2024

కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రామయ్య కానుక

image

కొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం భద్రచాలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం తరఫున ఈవో రమాదేవి, ఉప ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణాచార్యులు పట్టువస్త్రాలను తీసుకురాగా అంజన్న ఆలయ అధికారులు డప్పుచప్పుళ్ల మధ్య ఆలయం వరకు శోభా యాత్ర నిర్వహించారు. అనంతరం ఈవో చంద్రశేఖర్‌కు పట్టువస్త్రాలను అందజేశారు.

News May 31, 2024

మేడారం: పేకాట ఆడుతున్న 14 మంది అరెస్ట్

image

మేడారంలోని విఐపి పార్కింగ్ సమీపంలో పేకాట ఆడుతున్న 14 మందిని సివిల్, సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. WGL, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఇబ్రహీం, షకీల్, జావిద్, రవిచందర్, సంజీవ, నర్సింగం, సతీష్ ఇజ్జగిరి, లక్ష్మీనారాయణ, సంపత్, వేణు, సంతోష్, ఫరీద్, నగేష్ లు మేడారం జాతరకు వచ్చి విఐపి పార్కింగ్ సమీపంలోని శివరాంసాగర్ చెరువు పక్కన పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. రూ.2లక్షల 500 నగదు, 2కార్లు,13ఫోన్లను సీజ్ చేశారు.