India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు మళ్లీ తగ్గింది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఈరోజు రూ.100 పడిపోయింది. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7,24, బుధవారం రూ.7,400 పలికింది. ఈ క్రమంలో నేడు రూ.7,300కి తగ్గింది. దీంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు అయిన ఎంజీఎం ఆస్పత్రిలో గుండె సంబంధిత అత్యవసర సేవలు నిలిచిపోయాయి. అత్యాధునిక యంత్రాలున్నా సరైన టెక్నీషియన్లు లేక 2డీ ఏకో పరీక్షలు చేయడం లేదు. 2డీ ఎకో పరీక్షల కోసం బుధవారం పేషంట్లను కేఏంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆర్ఎంఓ-3 శ్రీనివాస్ స్పందిస్తూ పరీక్షలు చేయడం లేదనే విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి నేడు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్ నిర్మాణానికి సంబంధించి వరంగల్ జిల్లా మీదుగా 38.2 కిలోమీటర్ల మేర వెళ్లే రహదారి కోసం 160 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్య శారద దేవి తెలిపారు. మొత్తం 168 మంది భూ నిర్వాసితులకు రూ.10.38 కోట్ల నష్టపరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మిగిలిన రైతులకు కూడా త్వరలో పరిహారం చెల్లిస్తామని అన్నారు.
ఖానాపూర్ మండలంలో గల పాకాల సరస్సు నీటి మట్టం ఇటీవల కురిసిన వర్షాల ధాటికి 17.9 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30 అడుగులుగా ఉంది. పాకాల సరస్సులోని నీరు వచ్చి చేరుతుండటంతో ఇప్పటికే రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్దమై వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందుకోసం పాకాల నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
వరంగల్ జిల్లా <<13605294>>16చింతల్‌లో హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. నవంబర్‌లో గూడూరు మం. వాసి నాగరాజుతో దీపిక ప్రేమపెళ్లి జరగగా.. మనస్ఫర్ధలతో విడిపోయారు. దీంతో దీపిక కుటుంబంపై పగ పెంచుకున్న నాగరాజు అర్ధరాత్రి తల్వార్‌తో దీపిక కుటుంబంపై దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా.. NSPT ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తండ్రి శ్రీనివాస్ మృతి చెందాడు. నిందితుడు పరారయ్యాడు.
రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. మహిళా భద్రత, చైల్డ్ కేర్‌పై అధికారులతో సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా చిన్నారులకు యూనిఫాంలు అందిస్తామన్నారు. అంగన్ వాడీల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ‘అమ్మ మాట-అంగన్‌వాడీ బాట’ పేరుతో వెళ్తున్నట్టు చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ లాజిస్టిక్(కార్గో) ఏజెంట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజియన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రామయ్య, ఏజెంట్ డెవలప్‌మెంట్ అధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు. నగర పరిధిలో ఆసక్తి ఉన్నవారు రూ.5వేలు, ఇతర ప్రాంతాల్లో ఆసక్తి ఉంటే రూ.1,000 డిడి చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 9154298760 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. చెన్నారావుపేట మండలం పదహారుచింతల్‌లో కుటుంబకలహాలు, ప్రేమవ్యవహారంలో బన్ని అనే వ్యక్తి భార్యాభర్తలపై కత్తితో దాడిచేశాడు. ఈ ఘనటలో దంపతులు బానోతు శ్రీనివాస్, సుగుణ మృతి చెందగా.. కుమారుడు, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఎంజీఎంకు తరలించారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో బాధితులకు చెల్లించే పరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం హైద్రాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవితో మాట్లాడారు. ఈ సందర్భంగా వరంగల్ – ఖమ్మం కారిడార్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్‌కు సీఎం సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో పలువురు IPS అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో వరంగల్ రేంజ్ ఐజీగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన చంద్రశేఖర్ రెడ్డి 2016లో పూర్వపు మెదక్ జిల్లా ఎస్పీగా, అనంతరం సంగారెడ్డి ఎస్పీగా చేశారు. 2019లో DIG ర్యాంక్ పదోన్నతి పొందారు. 2021 నుంచి రామగుండం సీపీగా పనిచేశారు.
Sorry, no posts matched your criteria.