India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ రాష్ట్రంలో పలువురు IPS అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో వరంగల్ రేంజ్ ఐజీగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన చంద్రశేఖర్ రెడ్డి 2016లో పూర్వపు మెదక్ జిల్లా ఎస్పీగా, అనంతరం సంగారెడ్డి ఎస్పీగా చేశారు. 2019లో DIG ర్యాంక్ పదోన్నతి పొందారు. 2021 నుంచి రామగుండం సీపీగా పనిచేశారు.
నర్సంపేటలో ఇటీవల జరిగిన హత్యకు సంబంధించిన వివరాలను టౌన్ సీఐ రమణ మూర్తి బుధవారం వెల్లడించారు. NSPT ఇందిరమ్మకాలనీకి చెందిన ప్రవీణ్, రాజు, పవన్, శివ కుమార్ అనే నలుగురు మద్యానికి బానిసయ్యారు. మద్యం తాగేందుకు డబ్బుల కోసం నాలుగు రోజుల క్రితం కిరాణా షాపు నడుపుకుంటున్న రహీం ఇంట్లో ఒక్కడే ఉన్నాడని తెలుసుకున్నారు. అతనిపై పిడిగుద్దులతో దాడిచేసి, గొంతు నులిమి హత్య చేసి బావిలో పడేశారని తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు పల్లికాయ, పసుపు తరలివచ్చాయి. ఈ క్రమంలో క్వింటా పసుపు ధర రూ.12,501 పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.6110 పలకగా.. పచ్చి పల్లికాయ ధర రూ.4300 పలికింది. మరోవైపు మక్కలు రూ. 2620, 5531 మిర్చి 13వేల ధర పలికాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు తగుజాగ్రత్తలు పాటిస్తూ సరుకులు మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
రైతు భరోసా పథకంపై నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీ బలరాం నాయక్ చెప్పారు.
హైదరాబాద్‌లోని పరిశ్రమ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రాఘవరెడ్డిని మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర క్రమంగా పెరుగుతోంది. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7,240 అయింది. ఈరోజు మరింత పెరిగి రూ.7,400 అయినట్లు అధికారులు తెలిపారు. ధరలు పెరగడం కొంత ఉపశమనం కలిగించే విషయమైనప్పటికీ, మరింత పెరగాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.
వాజేడు బొగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులు జలపాతం నీటిలోకి దిగొద్దని వెంకటాపురం సీఐ బండారి కుమార్ తెలిపారు. బొగత జలపాతాన్ని వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌తో కలిసి పరిశీలించారు. వరద ప్రవాహం పరిస్థితి, సందర్శకుల తాకిడి గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులు ఎవరూ లోపలికి వెళ్లవద్దని, వీక్షకులను లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా చూడాలని అక్కడ ఉన్న అటవీశాఖ సిబ్బందికి సూచించారు.
భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ పట్టణ కేంద్రంలోని లేబర్ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన చేరాలు(45).. భార్య స్వప్నను(40) సోమవారం రాత్రి రోకలిబండతో కొట్టి చంపి పోలీసులకు పట్టుబడతాననే భయంతో మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. ఈ ఘటనతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కాకతీయ విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం “రాష్ట్రీయ ఉచ్చితర్ శిక్షా అభియాన్ (రుసా-RUSA) రాష్ట్ర ప్రభుత్వం తరుఫున 60:40 నిష్పత్తిలో రూ.50 కోట్లు 2020లో మంజూరు చేశారు. ఇందులో గతంలో రూ.15 కోట్లు విశ్వవిద్యాలయంలోని K-Hub భవన నిర్మాణం, వసతుల కొరకు విడుదల చేసారు. ప్రస్తుతం మిగతా రూ.35 కోట్లు పరిశోధన ప్రాజెక్టుల నిమిత్తం ఉత్తర్వులను విడుదల చేసింది.
గడ్డి మందు తాగి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నమిలిగొండలో జరిగింది. SI నాగరాజు వివరాల ప్రకారం.. స్టే.ఘ. మండలం నమిలిగొండకు చెందిన బాలిక(16)ను తల్లిదండ్రులు కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ మొదటి సం.లో చేర్పించారు. అక్కడ చదువుకోవడం ఇష్టం లేదని బాలిక పలుమార్లు చెప్పడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఈనెల 7న గడ్డి మందు తాగగా.. ఎంజీఎంలో చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందింది.
Sorry, no posts matched your criteria.