India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ వరంగల్ సాధారణ పరిపాలన ప్రజారోగ్యం అర్బన్ మలేరియా గణాంక విభాగాల ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఉద్యోగుల సీనియారిటీ జాబితా సిద్ధమైంది. బదిలీలపై ఈనెల 12లోగా ఉద్యోగులు ఆప్షన్లు ఇవ్వాలని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు వరంగల్ ప్రాంతీయ ఉపసంచాలకులు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 20లోగా బదిలీల ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.
వరంగల్ నగరంలో ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో రాత్రి 11.50 నిమిషాల ప్రాంతంలో కొంతమంది యువకులు రోడ్డుపై వెళ్తుండగా వారిని ఆపి ఏసీపీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి రోడ్లపై మీకు ఏం పని అంటూ.. వివరాలు ఆరా తీశారు. మరోసారి రాత్రి పూట రోడ్లపై కనిపిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి పట్టుబడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో జరిగింది. గ్రామ తాజా మాజీ సర్పంచ్ భర్త గవ్వాని నాగేశ్వరరావు పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో కార్యదర్శిని సంప్రదించారు. ఈ క్రమంలో కార్యదర్శి లంచం డిమాండ్ చేశారు. నేడు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం అతణ్ని విచారిస్తున్నారు.
హన్మకొండలో ప్రసిద్ధిచెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో శాఖంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పద్మాక్షి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా నేడు నాలుగవ రోజు అమ్మవారికి 10,008 గాజులతో, వివిధ రకాల పూలతో, కూరగాయలతో అలంకరించారు. అలాగే భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు. స్థానిక భక్తులు గుట్టపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 కార్పొరేషన్లకు ప్రభుత్వం సోమవారం ఛైర్మన్లను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆరు కార్పొరేషన్ ఛైర్మన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా నుంచి కుడా ఛైర్మన్‌గా వెంకట్రామిరెడ్డి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా పొదెం వీరయ్య, అయిత ప్రకాశ్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, మహమ్మద్ రియాజ్, బెల్లయ్యనాయక్‌లకు అవకాశం దక్కింది.
బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నేడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు CMO కార్యాలయం ట్వీట్ చేసింది. నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం తెలిపారని పేర్కొంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. ఈరోజు రూ.40 పెరిగి, రూ.7,240 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. పత్తి ధర మరింత పెరగాలని రైతన్నలు ఆకాంక్షిస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్ కు సరుకులు తీసుకొని రావాలని అధికారులు కోరుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి వద్దకు తల్లితో వచ్చిన బాలుడు.. ఆడుకుంటూ వెళ్లి మూత తెరిచిఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డాడు. కాగా, మృతుడి కుటుంబం MHBD జిల్లాకురవి మండలం సుదనపల్లికి చెందినవారు కాగా.. ఉపాధి నిమిత్తం పెద్దపల్లిలో ఉంటున్నారు.
కాకతీయ యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్(ఎంఎస్ డబ్ల్యూ) 2023-2024 రెండో ఏడాది టర్మ్ ఫీజు, పరీక్షల ఫీజులను ఈనెల 18 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించాలని యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు. దూరవిద్య కేంద్రంలోని ఎస్బీఐ కౌంటర్లో ఫీజు చెల్లించుకోవాలని పేర్కొన్నారు. త్వరలోనే రెండోవ ఏడాది తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.