India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లాలో వచ్చే రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఏమైనా ఫిర్యాదులుంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3434, మొబైల్ నంబరు 91542 52936 సంప్రదించాలన్నారు.
WGL జిల్లాలో విషాదం నెలకొంది. తన ఇంటినే బడిగా మార్చి అనేకమందికి అక్షరాలు నేర్పించిన చదువుల తల్లి HYDలో ఆదివారం మృతి చెందింది. పర్వతగిరికి చెందిన యశోదమ్మ(101) ఏడు దశాబ్దాల క్రితమే భర్త సహకారంతో పర్వతగిరితో పాటు.. చుట్టు పక్కల గ్రామాల వారికి తమ ఇంటి వద్ద చదువు బోధించింది. మాజీ మంత్రి దయాకర్ రావు సైతం ఆమె వద్ద ఓనమాలు నేర్చుకున్నారు. ఆమె HYDలో మరణించగా.. పర్వతగిరిలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని అధికారులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. 13, 22వ డివిజన్‌లో ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్లతో కలిసి మేయర్ పర్యటించారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని మేయర్ పిలుపునిచ్చారు.
వర్షాకాలంలో డయేరియా ప్రబలకుండా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కాన్ఫరెన్స్ హాల్‌లో అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, రాధికా గుప్తా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, ఇతర జిల్లా అధికారులతో కలసి డయేరియా అవగాహన కార్యక్రమాల వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు.
రాపిడో బాయ్‌పై దాడిచేసి గాయపరిచిన ఇద్దరిపై కేసు నమోదయింది. ఆదివారం ములుగు రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ కార్పొరేటర్ కానుగంటి శేఖర్ రాపిడో బుక్ చేసుకున్నాడు. రాపిడో బాయ్ సిద్దంశెట్టి కృష్ణంరాజు లోకేషన్ చేరుకున్నాడు. కృష్ణంరాజు లేట్ అవుతోంది తొందరగా రండి అన్నాడు. దానికి కొపగించుకున్న శేఖర్, రమణాచారితో కలిసి అతనిపై దాడిచేశారు. బాధితుడు సోమవారం హన్మకొండ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు ప్రకాష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ కార్పొరేషన్ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకాశ్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్‌గా జంగా రాఘవరెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ బలోపేతానికి కృషి చేస్తానని రాఘవరెడ్డి చెప్పారు. నూతన కార్పొరేషన్ ఛైర్మన్‌ను పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజన్న నీవు దూరమైనా.. నీ సాహసం చెరగని సంతకం, నీ ప్రస్థానం మరువని జ్ఞాపకం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని, ప్రతి తెలుగు వాడి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి నిలిచిపోయారని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు.
రెండు సార్లు విత్తనాలు వేసినా.. మొలకెత్తకపోవడంతో మహిళా రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వర్ధన్నపేట మున్సిపాలిటీలోని గుబ్బెడి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన కమలమ్మ 9 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తోంది. జూన్ నెలలో అప్పు తీసుకొచ్చి విత్తనాలు వేసినా వర్షాలు లేక మొలకెత్తలేదు. విత్తనాలు మొలకెత్తక, తెచ్చిన అప్పు తీర్చలేక మనస్తాపానికి గురైన కమలమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.18,000 ధర వచ్చింది. అలాగే ఏసీ 341 రకం మిర్చికి రూ.15,000, వండర్ హాట్(WH) మిర్చికి రూ.16,500 ధర పలికింది. అయితే గత వారంతో పోలిస్తే మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయి.
Sorry, no posts matched your criteria.