India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.18,000 ధర వచ్చింది. అలాగే ఏసీ 341 రకం మిర్చికి రూ.15,000, వండర్ హాట్(WH) మిర్చికి రూ.16,500 ధర పలికింది. అయితే గత వారంతో పోలిస్తే మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయి.
అసిఫాబాద్ రోడ్డు నుంచి రేచిని రోడ్డు మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల వల్ల తాత్కాలికంగా రద్దయిన ప్యాసింజరు రైళ్లను ఈనెల 8 నుంచి యథావిధిగా నడపనున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. 12757/58 కాగజ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌స్రెస్, 17233/34 భాగ్యనగర్ ఎక్స్‌స్రెస్, 17033/34 సింగరేణి ప్యాసింజర్ రైలు, 17003/04 రామగిరి, 07765/66 కరీంనగర్ పుష్పుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.
పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన సి.బాబు(27), ఆయన అన్న రాజు HYD మియాపూర్‌లోని మెట్రో రైలు డిపోలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇటీవల బాబు స్వగ్రామానికి వెళ్లి రాత్రి ఉరేసుకున్నాడు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో తన కొడుకు చనిపోయాడని అతడి తల్లి సరోజన PSలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు
మాజీ సర్పంచ్ హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. రాయపర్తి మండలం బురాన్‌పల్లి మాజీ సర్పంచ్ దేవేందర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. దేవందర్ ఇంట్లో ఉన్న క్రమంలోనే హత్య చేశారు. కాగా, భూ తగాదాల విషయంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పురుగు మందు తాగి భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులతోనే SI శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. NSPTలో ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, SI మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నేడు వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొనాలని కోరారు.
ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 8 నుంచి 11 వరకు టీ-శాట్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రసారమవుతాయన్నారు. జూలై 8న ఇంగ్లీషుపై, జూలై 9న సైన్స్, జూలై 10న గణితంపై, జూలై 11న తెలుగు, హిందీ, ఉర్దూ సబ్జెక్టుపై ప్రత్యక్ష ప్రసారాలు చేస్తామని టీ-శాట్ సీఈవో తెలిపారు.
హనుమకొండ: అరుణాచల గిరి దేవస్థాన దర్శనానికి వెళ్లే భక్తులకి వరంగల్ వన్ డిపో నుంచి స్పెషల్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయ భాను ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జులై 19న ఒక బస్సు బయలుదేరుతుందని, జులై 21న మధ్యాహ్నం మరో బస్సు బయలుదేరుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. మరిన్ని వివరాల కోసం 98663 73825 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.
క్రీ.శ 3వ శతాబ్దానికి చెందిన ఒక అరుదైన రాయిని గీసుకొండ మండల కేంద్రంలో డిస్కవరీ మ్యాన్ రత్నాకర్ రెడ్డి కనుగొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ అరుదైన రాయి అప్పట్లో పూసలు తయారు చేయడానికి వినియోగించి ఉంటారన్నారు. గ్రామంలోని పాటిగడ్డ అనే ప్రాంతంలో చరిత్రకు సంబంధించిన ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయన్నారు. పురావస్తు శాఖ అధికారులు వాటిని గుర్తించి మ్యూజియంలో భద్రపరచాలని కోరారు.
వరంగల్ జిల్లా నర్సంపేట ఇందిరమ్మ కాలనీలోని ఒక బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం.. గుర్తతెలియని వ్యక్తులు కొట్టి బావిలో పడేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.