Warangal

News July 6, 2024

సీఎంల సమావేశంను రాష్ట్ర ప్రజలు శుభసూచకంగా చూస్తున్నారు: MLC

image

నేడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని రాష్ట్ర ప్రజలు శుభసూచకంగా చూస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల వలె విభజన హామీల పరిష్కారం కాని అంశాల పరిష్కారం కోసం చర్చ జరుగుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ అర్ధం అవుతుందన్నారు.

News July 6, 2024

ఆషాఢ మాసం.. మొదటిరోజు రుద్రేశ్వర స్వామికి అలంకరణ ఇదే

image

హన్మకొండ నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన, కాకతీయుల కళాకట్టడమైన వేయిస్తంభాల దేవాలయంలో ఈరోజు రుద్రేశ్వరస్వామికి అర్చకులు ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. నేడు ఆషాఢ మాసం మొదటిరోజు కావటంతో స్వామికి సహస్ర జిల్లేడు పూలతో అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు స్వామికి విశేష పూజలు నిర్వహించి, భక్తుల సమక్షంలో హారతి ఇచ్చారు.

News July 6, 2024

శాకాంబరి ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

image

ఓరుగల్లు ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భద్రకాళి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

News July 6, 2024

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన కొండా సురేఖ

image

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు మంత్రులు కాసేపు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంత్రులు సూచించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News July 6, 2024

శిథిలావస్థకు చేరిన సర్వాయి పాపన్న కోట గోడలు!

image

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో సర్ధార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోటతో పాటు గోడలు శిథిలావస్థకు చేరి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన కోటను సంరక్షించేందుకు గతంలో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వానలకు కోట గోడలు శిథిలమై కూలుతున్నాయి. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న కోటకు అధికారులు మరమ్మతులు చేపట్టి సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

News July 6, 2024

వరంగల్: ముందే మేల్కొనకపోతే ప్రమాదం తప్పదు!

image

గ్రేటర్ వరంగల్ పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. వానాకాలం నేపథ్యంలో అలాంటి పురాతన భవనాలు, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. మున్సిపాలిటీ అధికారులు సకాలంలో స్పందించి ఆయా భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం చేయకపోతే గతం మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.

News July 6, 2024

UPDATE: దంతాలపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

MHBD జిల్లా దంతాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొని <<13573092>>ముగ్గురు వ్యక్తులు మృతి<<>> చెందిన విషయం విదితమే. ఈ ఘటనలో మల్లేశ్, నరేశ్, కుమార్ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందిస్తున్నారు. వీరు తొర్రూరు మండలం వెలికట్ట నుంచి ఆటోలో బీరిశెట్టిగూడెనికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.కి.మీ అయితే ఇంటికి చేరుకునే వారని స్థానికులు చెప్పారు.

News July 5, 2024

MHBD: కారు, ఆటో ఢీ.. ముగ్గురి మృతి

image

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దంతాలపల్లి మండలం చారి తండా శివారులో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

వరంగల్: ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

image

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగవకాశాలు కల్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేసిన సైబర్‌ నేరస్థుడిని వరంగల్‌ సైబర్‌ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతణ్నుంచి సుమారు రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లాకి చెందిన పొనగంటి సాయితేజ(28) MBA చేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో 2 తెలుగురాష్ట్రాల్లో సుమారు రూ.35 మంది నుంచి రూ.45 లక్షలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.

News July 5, 2024

HNK: అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ మంత్రి సమీక్షా సమావేశం

image

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు, తదితర అంశాలను సమావేశంలో జిల్లా కలెక్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించారు.