India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలపై పోలీస్ సిబ్బంది తప్పక అవగాహన కలిగి ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ అన్నారు. నూతన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన పుస్తకాలను పోలీస్ సిబ్బందికి నేడు అందజేశారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బందికి క్రిమినల్ చట్టాలపై అవగాహన కలిగి ఉన్నపుడే బాధితులకు న్యాయం చేయగలరని అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, వరంగల్ మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, తదితర అంశాలపై సెక్రటేరియట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, అధికారులు నిజాయితీగా సేవలు అందించాలని మంత్రులు అన్నారు.
డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. నిరుద్యోగులు సమయం కోరుతున్నారని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర రూ.30 పెరిగింది. మంగళవారం, బుధవారం రూ.7,170 పలికిన పత్తి ధర నేడు రూ.7,200 పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలో హెచ్చు తగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
వరంగల్ NITలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్య్వూల్లో బీటెక్ (ECE) విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కింది. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన రవిషా తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. కోడింగ్‌లో మెలకువలు, క్లబ్‌ల నుంచి అందిన మార్గదర్శకత్వం తనకు తోడ్పడ్డాయని రవిషా తెలిపారు. మరో 12 మంది రూ.68 లక్షల వార్షిక వేతన ప్యాకేజీలు లభించగా, 82 శాతం మంది బీటెక్ విద్యార్థులు ఉద్యోగం సాధించారు.
మరణంలోనూ మరో ఇద్దరికీ కంటి చూపునిచ్చాడు భీక్యా నాయక్. కుటుంబీల వివరాలు.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దేవీ లాల్ తండాకు చెందిన గుగులోత్ యాకూబ్ కుమారుడు భీక్యా నాయక్ అనారోగ్యంతో ఎంజీఎంలో బుధవారం మృతి చెందాడు. అయితే భీక్యా నాయక్ కుటుంబ సభ్యులు, తమ కుమారుడు మరణంలోనూ ఇతరులకు సహాయ పడాలనే ఉద్దేశంతో రామాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్‌కు భీక్యా నాయక్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు.
ఉరేసుకుని ఓ యువతి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాల తండాలో బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన అనూష (20) డిగ్రీ మధ్యలోనే ఆపి వేసి కుటుంబ సభ్యులతో వ్యవసాయ పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో సురేశ్‌తో ప్రేమ ఏర్పడింది. సురేశ్ కు ఇది వరకే పెళ్లి అయ్యి భార్యాపిల్లలు ఉండటంతో పలువురు అనూష – సురేశ్ పెళ్లిని వ్యతిరేకించారు. సురేశ్ వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది.
కేసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసముద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం క్వింటా పసుపు రూ.13,559 (నిన్న రూ.13,859) ధర పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.6000 అయింది. పచ్చి పల్లికాయకు రూ.4,300 ధర వచ్చింది. మరోవైపు మక్కలు రూ.2,535 పలకగా.. 5531 రకం మిర్చికి రూ.14,000 ధర వచ్చింది. పసుపు, పల్లికాయ ధరలు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.
హనుమకొండ బాలసముద్రంలోని AISF జిల్లా కార్యాలయంలో SFI, AISF, PDSU, NSUI విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. జులై 4న తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. రాత పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలని ఖండించాలన్నారు.
Sorry, no posts matched your criteria.