Warangal

News May 20, 2024

మేడారం: రెండు రోజులు సమ్మక్క- సారాలమ్మ దర్శనాలు నిలిపివేత

image

తమ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేయనున్నారు. ఆదివారం గద్దెల వద్ద పూజారులు, వాటాదారులు సమావేశం నిర్వహించారు. వరంగల్‌లో తమకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు భద్రకాళి దేవస్థాన పూజారులు చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే 2రోజులు దర్శనాల నిలిపివేతకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

News May 20, 2024

WGL: అప్పుడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు

image

KMM-WGL-NLG MLC స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మల్లన్న (INC), రాకేశ్ రెడ్డి (BRS), ప్రేమేందర్ రెడ్డి (BJP) పోటీ చేస్తున్నారు. అయితే ముగ్గురు గతంలో BJPలో ఉన్నవారే. తీన్మార్ మల్లన్న 2021లో BJPలో చేరి, తిరిగి 2023లో హస్తం గూటికి చేరారు. ప్రేమేందర్ రెడ్డి BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాకేశ్ రెడ్డి 2013లో BJPలో చేరి BJYMలో అనేక పదవులు చేపట్టారు. ఈ ఏడాదే BRS పార్టీలో చేరారు.

News May 20, 2024

WGL: ఆస్తి కోసం తాతను చంపిన మనవళ్లు!

image

ఆస్తి తగాదాల్లో తాతను మనవళ్లు హత్యచేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో జరిగింది. హసన్‌పర్తికి చెందిన జల్లి సారయ్య (80)తో అతని మనవళ్లు సాయికృష్ణ, శశికుమార్ పలుమార్లు ఆస్తి విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే వారిద్దరు సారయ్యపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం వాకింగ్ స్టాండ్‌తో సారయ్య తలపై బలంగా కొట్టగా.. ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 20, 2024

WGL: నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఈ పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించగా ఈసారి ఆన్లైన్ పద్ధతిలో చేపట్టనున్నారు. డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు సైతం పరీక్ష రాయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,949 మంది హాజరుకానున్నారు.

News May 20, 2024

REWIND: ఓడిపోయిన అరూరి రమేశ్!

image

అరూరి రమేశ్ వరంగల్ లోక్‌సభ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన 87,238 ఓట్లు సాధించి ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అరూరి ఈ లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
– దీనిపై మీ కామెంట్?

News May 20, 2024

వరంగల్ మార్కెట్ నేడు పున:ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News May 19, 2024

తాడ్వాయి: అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన లారీ

image

తాడ్వాయిలో ప్రమాదం తప్పింది. పసర నుంచి ఏటూరు నాగారం వైపు వస్తున్న ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ప్రమాద సమయంలో తాడ్వాయిలో వర్షం పడుతుండగా రోడ్డుపైన ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్ వైర్లు తెగి రోడ్డుకి అడ్డంగా పడ్డాయి.

News May 19, 2024

WGL: 2.90లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా..!

image

వరంగల్ జిల్లాలో ఈ వానాకాలంలో 2.90లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా 1.34లక్షల ఎకరాల్లో వరి, 1.22లక్షల ఎకరాల్లో పత్తి, 4వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని అభిప్రాయ పడుతున్నారు. కాగా గతేడాది పత్తికి మార్కెట్లో కొంత మెరుగ్గానే మద్దతు ధర రావడంతో ఈ సారి పత్తి సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకుగాను ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.

News May 19, 2024

విజిలెన్స్ ఎంక్వయిరీని ఆహ్వానించిన కేయూ వీసీ

image

కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా మూడు సంవత్సరాల పదవీ కాలంలో ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై వేసిన విజిలెన్స్ విచారణ కమిటీని స్వాగతిస్తున్నానని తెలిపారు. తాను ఇక్కడే ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి, ఇక్కడే ఉన్నత విద్యను అభ్యసించి ఇక్కడే ఉద్యోగం పొంది 30 సంవత్సరాలకు పైగా నిబద్ధతగా పనిచేశానన్నారు.

News May 19, 2024

WGL: తల్లిపై కుమారుడి దాడి

image

భూమి పట్టాచేయాలని కుమారుడు తల్లిపై దాడి చేసిన ఘటన ఎల్కతుర్తి మండలంలో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. పెంచికల్పేట్ గ్రామానికి చెందిన చిలుముల లక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమారుడు రఘుపతి ఈ నెల 17న తన భాగానికి వచ్చిన భూమి తోపాటు తల్లి దగ్గరున్న 20 గుంటలు కూడా తన పేరున పట్టా చేయాలని లక్ష్మిని తీవ్రంగా కొట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం నిందితుడిపై కేసు నమోదు చేశారు.