Warangal

News July 2, 2024

వరంగల్: పెరిగిన మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.18,500 పలికింది. అలాగే ఏసీ 341 రకం మిర్చి రూ.16,500, వండర్ హాట్(WH) మిర్చికి రూ.18,500 ధర వచ్చింది. కాగా తేజ మిర్చి నిన్నటితో పోలిస్తే రూ.500, 341 మిర్చి రూ.500 తగ్గాయి. వండర్ హాట్ మిర్చి నిన్న రూ.16,000 పలకగా రూ.2,500 పెరిగి 18,500 పలికింది.

News July 2, 2024

నేడు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర 7,170

image

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తిధరలు నిలకడ కోల్పోతున్నాయి. నిన్న సోమవారం 7, 160 పత్తికి ధర పలకగా ఈరోజు (మంగళవారం) స్వల్పంగా పది రూపాయలు పెరిగి రూ.7,170 ధర పలికింది. మద్దతు ధర కంటే మార్కెట్లో పత్తికి ధర తక్కువ పలుకుతుండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పత్తి ధరలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News July 2, 2024

వరంగల్: పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లుగా దరఖాస్తులు

image

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలల్లో హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులకు పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లుగా పనిచేయడానికి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ సమన్వయ అధికారి ఎన్.విద్యారాణి తెలిపారు. పీజీలో సంబంధిత సబ్జెక్టుతో పాటు బీఈడీ ఉన్న అభ్యర్థులు హన్మకొండలోని RCO ఆఫీస్‌లో ఈనెల 3లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 4న డెమో ఉంటుందన్నారు.

News July 2, 2024

వరంగల్: ఉమ్మడి జిల్లాలో పలువురు ఏఎస్పీల బదిలీ

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు ఏఎస్పీలు బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఏఎస్పీ మహేష్ బాబాసాహెబ్ ములుగు ఓఎస్డీగా బదిలీ అయ్యారు. జనగామ ఏఎస్పీ అంకిత్ కుమార్ శంకవార్ భద్రాచలంకు, గ్రేహౌండ్స్ నుంచి శివమ్ ఉపాధ్యాయ ఏటూరునాగారం ఏఎస్పీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

News July 1, 2024

మహబూబాబాద్: ప్రాణాల మీదికి తెచ్చిన సర్పంచ్ పదవి !

image

చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక, తెచ్చిన అప్పులను తీర్చలేక మనోవేదనతో సర్పంచ్ భర్త మృతిచెందిన ఘటన మహబూబాబాద్ (M)లో చోటుచేసుకుంది. తూర్పుతండాకు చెందిన కృష్ణ.. సర్పంచ్ ఎన్నికల్లో తన భార్యను పోటీచేయించాడు. గెలిచిన అనంతరం జీపీలో అప్పులు తెచ్చి అభివృద్ది పనులు చేయించాడు. దీంతో చేసిన పనులకు బిల్లులు రాక, ఎన్నికల సమయంలో పోటీచేసేందుకు తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనతో నేడు కృష్ణ మృతి చెందాడు

News July 1, 2024

అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన సీతక్క

image

ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేడమ బొజ్జు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

News July 1, 2024

మాస్టర్ ప్లాన్-2050ను తయారు చేయాలి: సీఎం

image

వరంగల్ దశ, దిశ సాంస్కృతిక, వారసత్వానికి తగినట్లుగా మాస్టర్ ప్లాన్-2050ను తయారు చేయాలని సీఎం సూచించారు. అయితే.. బృహత్తర ప్రణాళిక 171 గ్రామాలను కలుపుకొని 1,805 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది. మాస్టర్ ప్లాన్‌పై ప్రజల నుంచి అనేక అభ్యంతరాలున్నాయి. భవిష్యత్ అవసరాల కోసం రూపకల్పన చేసే ప్రణాళికల్లో ప్రజలను భాగ స్వామ్యం చేయాల్సి ఉంటుంది. అందరికీ ఆమోదయోగ్యంగా సమగ్ర వివరాలతో డిజైన్ చేయాల్సి ఉంది.

News July 1, 2024

నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త చట్టాలు: వరంగల్ సీపీ

image

నేటి నుంచి మూడు కొత్త చట్టాలు(BNS, BNSS & BSA) అమల్లోకి వస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆపరాధ న్యాయవ్యవస్థలో సంస్కరణలు చేయడానికి, మూడు కొత్త చట్టాలు, (1) భారతీయ న్యాయ సంహిత, (2) భారతీయ నాగరిక సురక్షా సంహిత, (3) భారతీయ సాక్ష్య అధినియం అమలులోకి వచ్చాయని తెలిపారు.

News July 1, 2024

వరంగల్ నగరంలో వ్యక్తి దారుణ హత్య

image

గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన వరంగల్ పట్టణ కేంద్రంలోని బట్టల బజార్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్లంబజారుకు చెందిన పూసల భద్రయ్య(55) రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 1, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరల వివరాలు..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.19 వేలు పలికింది. ఏసీ 341 రకం మిర్చి రూ.17,000, వండర్ హాట్(WH) మిర్చికి రూ.16,000 ధర వచ్చింది. కాగా, గత శుక్రవారంతో పోలిస్తే తెజ, 341 మిర్చిలు రూ.500 పెరగగా.. వండర్ హాట్ మిర్చి ధరలు రూ.1000 తగ్గింది.