India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునఃప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలిరాగా.. ధర మాత్రం గత వారంలాగే రూ.7,160 పలికింది. పత్తి ధర పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. కాగా, మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంన్నది.
ఓ వ్యక్తి వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన MHBD జిల్లా నెల్లికుదురు మం.లో ఆదివారం జరిగింది. SI క్రాంతికిరణ్ ప్రకారం.. పెద్దతండాకు చెందిన నీలమ్మను అదే గ్రామానికి చెందిన వీరన్న అనే వ్యక్తి తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. నీలమ్మ భర్త భద్రు అవమానానికి గురై పురుగు మందు తాగగా.. నీలమ్మ సైతం ఆత్మహత్యకు పాల్పడింది. నీలమ్మ మృతి చెందగా.. భద్రు చికిత్స పొందుతున్నాడు.
ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మధ్య కలహాలు పెరిగాయనే విమర్శలొస్తున్నాయి. శనివారం CM రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కనీస సమాచారం లేదని పలువురు ముఖ్యనాయకులు వాపోయారు. ఇదిలా ఉండగా CM పర్యటనలో NSPT MLA దొంతి మాధవరెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. పరకాల నియోజకవర్గంలో సైతం ఫ్లెక్సీలు, ఇతర అంశాలపై వాగ్వాదాలు జరుగుతుండగా.. వర్ధన్నపేటలో నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.
సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటానికి సిద్ధమైంది. సోమవారం నుంచి సింగరేణి వ్యాప్తంగా దశలవారీగా ఆందోళన కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి స్పష్టం చేశారు. 1న గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడంతో పాటు గని అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీరాములు(34) MHBD జిల్లా కేంద్రంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. WGL జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో 5 నెలలుగా SIగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్టేషన్ నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టగా విషయం బయటపడింది. వరంగల్ ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
జూలై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేర, న్యాయచట్టాలు-2023 అమలులోకి రానున్నట్లు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. నూతన చట్టాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి నెలరోజుల పాటు నిర్వహించిన శిక్షణ, అవగాహన ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నూతన చట్టాల వల్ల కేసుల దర్యాప్తులో వేగం పెరిగి బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్న వాగు వద్ద పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు తల్లుల గద్దెల వద్దకు చేరుకొని తల్లులకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరె, సారె, బంగారం ( బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకొని బాలికను ఓ యువకుడు అత్యాచారం చేశాడు. HNK జిల్లా కమలాపూర్ మండలంలో తాతయ్య ఇంటి వద్ద ఉంటున్న ఓ బాలిక (15)తో కామారెడ్డికి చెందిన శంకర్ (23) ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మిన ఆ బాలిక ఈనెల 23న ఇంట్లో నుంచి వెళ్లింది.అయితే శంకర్ తనను నమ్మించి అత్యాచారం చేశాడని బాలిక తన మేనమామకు చెప్పడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు.
భార్య మందుల కోసం వచ్చి ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాలకు చెందిన నంగునూరు నాగన్న (62) భార్య మందుల కోసం తొర్రూరుకు వెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్సులో వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
Sorry, no posts matched your criteria.