India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా వరంగల్-సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్ పుల్ రైలును జులై 1 నుంచి 31 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే భద్రాచలం రోడ్-విజయవాడ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు, కాజీపేట-బల్లార్షా మధ్య నడిచే కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్, సిర్పూర్ కాగజ్‌నగర్- కరీంనగర్ ప్యాసింజరు రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
కేసముద్రం మండల పరిధిలోని రైస్ మిల్లుల్లో శుక్రవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ తనిఖీల్లో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. CMR కింద ధాన్యాన్ని మర పట్టించి ప్రభుత్వానికి అందించాల్సిన రు.30.38 కోట్ల విలువ చేసే బియ్యాన్ని మిల్లర్లు మాయం చేసినట్లు అధికారులు తేల్చారు. ఆయా మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లై డీఎం కృష్ణవేణి తెలిపారు.
హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జూలై 1న వరంగల్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు మూగల కుమార్ యాదవ్, ఊర యుగేందర్ రెడ్డి తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జులై 7న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
KU పోతన హాస్టల్‌లో పీజీ ఫస్టియర్ విద్యార్థిని సంధ్య(పోలిటికల్ సైన్స్) తలపై ఫ్యాన్ పడి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఆమె తలకు వైద్యులు 18 కుట్లు వేశారు. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూంలు సరిగా లేవని, కలుషితమైన నీటిని తాగడానికి ఇస్తున్నారంటూ వాపోయారు.
కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహచారి, అదనపు నియంత్రణ అధికారి సౌజన్య శుక్రవారం విడుదల చేశారు. జులై 5, 8, 10, 12, 15, 18న ఉంటుందని తెలిపారు. పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
జనగామ జిల్లాను ఆదర్శవంతమైన మహిళా శక్తి దిశగా నిలపాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేటులో మండలాల సీసీలు, ఏపీఎంలు, వీవోలకు మహిళా శక్తి పథకంపై కలెక్టర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలకు జీవనోపాధి కల్పించాలని వారిని మరింత ఎక్కువగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళాశక్తి పథకాన్ని ప్రారంభించిందన్నారు.
మహారాష్ట్ర, తెలంగాణా సరిహద్దులోని పోలీసులు.. మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మావోల ప్రాబల్యం ఉన్నందున, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడైన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు స్వగ్రామం వంగర పర్యాటకాభివృద్ధి కలగానే మిగిలింది. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా 2020లో మాజీ సీఎం కేసీఆర్ వంగర గ్రామంలో పీవీ జ్ఞాన వేదిక స్మృతివనం ఏర్పాటుకు రూ.7 కోట్లు మంజూరు చేసినా పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. శుక్రవారం పీవీ 103వ జయంతి సందర్భంగా పనుల నత్తనడకపై గ్రామస్థులు విమర్శలు చేస్తున్నారు.
జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం సూరారం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి వివాహిత మృతి చెందింది. ఎస్సై రవి యాదవ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుప్రియ మధ్యాహ్నం ఇంటి వద్ద పని చేస్తున్న క్రమంలో ఇంట్లోని విద్యుత్ వైరు చేతికి తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదవశాత్తు వృద్ధుడి కాళ్లపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలైన ఘటన హన్మకొండ బస్టాండ్ వద్ద నేడు చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. బస్టాండ్ మూల వైపు నుంచి వృద్ధుడు వెళ్తుండగా బస్టాండ్ లోపలి నుంచి వస్తున్న బస్సు వృద్ధుడి కాళ్లపై నుంచి వెళ్లింది. దీంతో వృద్ధుడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.