India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రమాదవశాత్తు వృద్ధుడి కాళ్లపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలైన ఘటన హన్మకొండ బస్టాండ్ వద్ద నేడు చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. బస్టాండ్ మూల వైపు నుంచి వృద్ధుడు వెళ్తుండగా బస్టాండ్ లోపలి నుంచి వస్తున్న బస్సు వృద్ధుడి కాళ్లపై నుంచి వెళ్లింది. దీంతో వృద్ధుడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్లు డ్రైవింగ్ చేస్తూ ఇటీవల పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు ఈరోజు వారిపై జువెనైల్ కోర్టులో ఛార్జిషీట్ ఫైల్ చేయగా.. వారిని ఒకరోజు బాలల అబ్జర్వేషన్ హోమ్‌కి పంపించారు. ఇకపై వాహనాలు నడిపే మైనర్లను పట్టుకుని ఛార్జిషీట్ ఫైల్ చేసి కోర్టు ముందు మైనర్, వారి తల్లిదండ్రులను హాజరుపరుస్తామని పోలీసులు హెచ్చరించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకురావొద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.18,500 పలకగా.. ఏసీ 341 రకం మిర్చి రూ.16,500 పలికింది. వండర్ హాట్(WH) మిర్చికి రూ.17,000 ధర వచ్చింది. కాగా, నిన్నటితో పోలిస్తే 341, వండర్ హాట్ మిర్చి ధరలు రూ.500 తగ్గాయి. తేజా మిర్చి ధర అలానే ఉంది.
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర మళ్లీ తగ్గింది. నేడు క్వింటా పత్తికి రూ.7,160 ధర వచ్చింది. 3 రోజులుగా పత్తి ధరలు చూస్తే బుధవారం రూ.7,090, గురువారం రూ.7,210కి పలికాయి. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు రూ.50 తగ్గింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేరుశనగ పంట సాగు విస్తీర్ణం ఏటికేడు తగ్గుముఖం పడుతోంది. గతేడాది సుమారు 5 వేల ఎకరాల వరకు సాగు చేసిన రైతులు ఈ ఏడాది 4,200 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. దానికి తోడు ఆకుమచ్చ, ఆకు పీల్చే పురుగులు తదితర కారణాలతో వేరుశనగ పంట దిగుబడి తగ్గిపోతోంది. గతేడాది క్వింటా రూ.8 వేల వరకు పలికిన పల్లి ఈ ఏడాది రూ.5 వేల వరకు పడిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
పాకాల వెళ్లే పర్యాటకులకు రెట్టింపు ఆనందం కలగనుంది. కొన్ని రోజులుగా నిలిచిన బోటు షికారు మళ్లీ ప్రారంభం కానుంది. గతంలో పాకాల సరస్సు WGL జిల్లా ఖానాపురం మండలంలో ఉండగా.. జిల్లాల పునర్విభజనతో కొంత భాగం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో చేరింది. దీంతో అటవీ, పర్యాటక శాఖల మధ్య టికెట్ల పంపిణీలో తలెత్తిన కారణాలతో బోటు షికారు నిలిచింది. కాగా స్థానిక MLA చొరవతో బోటింగ్ మళ్లీ ప్రారంభించనున్నట్లు సమాచారం.
హన్మకొండ కలెక్టరేట్‌లో ఈరోజు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతుండగా <<13521309>>పవర్ కట్<<>> విషయమై ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వివరాలు తెలిపింది. హన్మకొండ కలెక్టరేట్‌కు 11కేవీ ఫీడర్‌పై విద్యుత్ సరఫరా బంద్ లేదని ఎక్స్‌లో సంబంధిత అధికారులు తెలిపారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా కలెక్టరేట్‌లో సిబ్బంది ముందస్తు టెస్టింగ్‌లు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం అవాస్తవమన్నారు.
వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులు కొండా సురేఖ, సీతక్క పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రోటోకాల్‌ను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా వ్యవహరించాలని అధికారులకు మంత్రులు సూచించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి నేడు పసుపు, పల్లికాయ తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపు రూ.14,159 ధర పలికింది. అలాగే సూక పల్లికాయ రూ.6010, పచ్చి పల్లికాయకి రూ.4,100 ధర వచ్చింది. మరోవైపు మక్కలు రూ.2,550 పలకగా.. 5531 రకం మిర్చికి రూ.14,800 ధర పలికింది. మార్కెట్‌లో పసుపు ధర ఒక రోజు వ్యవధిలోనే రూ.500 తగ్గగా.. పల్లికాయ ధరలు స్వల్పంగా పెరిగాయి.
Sorry, no posts matched your criteria.