India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగేళ్ల కాలంలో కొత్తగా 12 డీసీసీబీ బ్యాంకులను ఏర్పాటు చేశామని డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు తెలిపారు. కురవి, మొగుళ్లపల్లి, దేవరుప్పుల, రఘునాథపల్లి, సంగెం, హసన్‌పర్తి, మంగపేట, గీసుగొండ, నర్సింహులపేట, బచ్చన్నపేట, నెల్లికుదురు తదితర 11 ఏరియాల్లో నూతన బ్యాంకుల ఏర్పాటుకు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.18,500 పలికింది. అలాగే ఏసీ 341 రకం మిర్చి రూ.17,000, వండర్ హాట్ (WH) మిర్చి రూ.17,500 ధర పలికాయి. కాగా నిన్నటితో పోలిస్తే తేజ మిర్చి రూ.500 పెరగగా.. అన్ని రకాల మిర్చి ధరల్లో నిన్నటి లాగే తటస్థంగా ఉన్నాయి. మార్కెట్లో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర రైతన్నలకు ఊరటనిచ్చింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. నిన్న రూ.7,090 పలికిన క్వింటా పత్తి.. ఈరోజు రూ.7,210కి చేరింది. ఒక రోజు వ్యవధిలోనే రూ.120 ధర పెరగడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత ధర పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి అక్కడి ఏర్పాట్లను సంబంధిత అధికారులతో పరిశీలించారు. పార్కులో చేపట్టిన పనులు, ఫొటో ఎగ్జిబిట్లను సీఎం తిలకిస్తారని చెప్పారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ రవీందర్ తదితరులు ఉన్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల హుండీల లెక్కింపును రేపు గురువారం ప్రారంభించనునట్లు మేడారం ఈవో రాజేంద్రం తెలిపారు. పూజారులు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారుల భారీ బందోబస్తు నడుమ మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయం ఆవరణలో హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం డోర్నకల్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే చర్చించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
మామను గొడ్డిలితో నరికి చెరువులో పడేసిన అల్లుడికి జీవితఖైదు విధిస్తూ HNK జడ్జి అపర్ణాదేవి తీర్పుచ్చారు. నడికూడ (M) కంఠాత్మకూరు వాసి ఎల్లయ్య(55)తన కుమార్తె స్వాతిని వెంకటేశ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. 2020 OCT 6న ఎల్లయ్య, వెంకటేశ్ హసన్‌పర్తి చెరువుకట్టపైకి కల్లు తాగడానికి వెళ్లారు. ఈక్రమంలో వారి మధ్య గొడవ జరగగా వెంకటేశ్ గొడ్డలితో నరికి మృతదేహాన్ని చెరువుతో పడేశాడు.
భూపాలపల్లి జిల్లా మల్హర్(M)లో ఓ మహిళను <<13508723>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని అనుసాన్‌పల్లి వాసి సుమత(30), ఆకుదారివాడ వాసి హతిరాంకు పెళ్లైంది. భర్త వివాహేతర సంబంధం కారణంగా తరచూ ఇద్దరికి గొడవలు జరిగేవి. ఈక్రమంలో మంగళవారం ఆమెను చున్నీతో ఉరేసి చంపి, ఒంటిపై ఉన్న బంగారం తీసుకొని ఎవరో హత్య చేసినట్లు చిత్రీకరించాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు CI నరేశ్ కేసు నమోదు చేశారు.
పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. దేశ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకై పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సత్తా రాహుల్ గాంధీకి ఉందన్నారు. భారత్ జోడోయాత్రతో దేశ ప్రజల్లో రాహుల్ గాంధీ సమైక్యతను నింపారన్నారు.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌తో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద 10 లక్షల గృహాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 53.98 లక్షల గృహాలకు రక్షిత మంచినీరు అందుతుందన్నారు. కొత్తగా ఏర్పాటైన ఆవాసాలకు, కొత్తగా నిర్మించిన గృహాలకు నల్లాల ద్వారా మంచినీటి సరఫరాకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.