Warangal

News June 26, 2024

ప్రాథమిక విద్య కేంద్రాలుగా అంగన్వాడీలు: వాకాటి కరుణ

image

పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు ప్రాథమిక విద్య అందించాలని ప్రభుత్వం అంగన్వాడీ పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందన్నారు.

News June 25, 2024

భూపాలపల్లి జిల్లాలో మహిళ హత్య

image

భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఫకీర్ గడ్డాలో ఇస్లావత్ సుమతిని హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న ఆరు తులాల బంగారాన్ని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News June 25, 2024

HNK: ఈనెల 29 నుంచి వ్యాయామ విద్య డిగ్రీ నాలుగో సెమిస్టర్

image

కాకతీయ విశ్వవిద్యాలయం వ్యాయామ విద్య డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహాచారి, అదనపు నియంత్రణ అధికారి డా.రాధిక విడుదల చేశారు. మొదటి పేపర్ జూన్ 29న, రెండో పేపర్ జులై 1న, మూడో పేపర్ 3న, నాలుగో పేపర్ 5న ఉన్నట్లు తేలిపారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

News June 25, 2024

తొర్రూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

తొర్రూరు డివిజన్ పరిధిలోని మడిపల్లి శివారులోని అకేరు వాగు సమీపంలో తొర్రూరు-నెల్లికుదురు రోడ్డు పై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తొర్రూరులోని అమృత బ్రెడ్ ట్రాన్స్ పోర్ట్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడు చెర్లపాలెం గ్రామానికి చెందిన హనుమండ్ల సుధాకర్ రెడ్డి‌గా గుర్తించారు.

News June 25, 2024

వరంగల్: ప్రేమ పేరుతో వేధింపులు.. 2ఏళ్లు జైలు

image

బాలికను వేధించిన నిందితుడికి 2ఏళ్ల శిక్ష విధిస్తూ HNK అదనపు కోర్టు జడ్జి అపర్ణాదేవి తీర్పిచ్చారు. ధర్మసాగర్(M) వాసి ఓ బాలికను బంధువైన దిలీప్ ప్రేమిస్తున్నానని వేధించేవాడు. 2018 APL29న బాలికకు ఫోన్‌ చేసి పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని బెదిరించడంతో ఇంటి నుంచి వెళ్లింది. బాలిక తండ్రి PSలో ఫిర్యాదు చేయడంతో దిలీప్ ఆమెను ఇంటికి పంపించాడు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు.

News June 25, 2024

వరంగల్: ఈనెల 30 వరకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. ఈ నెల 30 వరకు సంబంధిత వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇంటర్‌లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 45 శాతం, ఇతరులు 50 శాతం అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు.

News June 25, 2024

NPDCL సీఎండీ అధికారులకు కీలక సూచన 

image

NPDCL కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి నోడల్ ఆఫీసర్లు, సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. సోమవారం ఈ కాన్ఫరెన్స్‌లో సీఎండీ మాట్లాడుతూ.. బ్రేక్ డౌన్, ట్రిప్పింగ్‌లు జరిగినప్పుడు ప్రతి చోట ప్రత్యామ్నాయ సరఫరా ఉండేటట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News June 24, 2024

28న వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

వరంగల్ నగరంలో ఈ నెల 28న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగర అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కుడా పరిధిలో చేపట్టబోయే అండర్ డ్రైనేజీ పనులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

News June 24, 2024

పాకాల చెరువులో చేపల వేటకు దిగిన వ్యక్తిపై మొసలి దాడి

image

చెరువులో చేపల వేటకు దిగిన వ్యక్తిపై మొసలి దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో జరిగింది. గ్రామానికి చెందిన మురళి పాకాల చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మొసలి అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో మురళికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మురళి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

News June 24, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. వరంగల్ జిల్లా లాస్ట్

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు ప్రథమ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లాలో 632 (85.29 %) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. హనుమకొండ 8,856 (69.77%), భూపాలపల్లి 521 (68.23%), మహబూబాబాద్ 1,301 (63.56%), జనగామ 1,167 (61.95%), వరంగల్ 1,857 (58.66%) మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ ఇయర్‌లోనూ వరంగల్ చివరి స్థానంలో నిలిచింది.