India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు ప్రథమ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లాలో 189 (81.47 %) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. భూపాలపల్లి 302 (71.23%), జనగామ 693 (56.02%), హనుమకొండ 2,672 (54.12%), మహబూబాబాద్ 601 (50.76%), వరంగల్ 1,029(46.33%) మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో వరంగల్ చివరి స్థానంలో నిలిచింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో రాష్ట్రంలో ములుగు ప్రథమ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లాలో 85.29 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.. ములుగు జిల్లా వ్యాప్తంగా 741 మంది పరీక్ష రాయగా.. 632 మంది పాసయ్యారు. 423 మంది బాలురకు గాను 352 మంది(83.22) పాసవ్వగా.. 318 మంది బాలికలకు గానూ 280 మంది(88.05శాతం) పాసయ్యారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో వర్షిణి(14) అనే 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఈనెల 21న పాఠశాలలో చేర్పించారు. అక్కడి వాతావరణం నచ్చకపోవడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య తొలిసారి అడుగుపెట్టనున్నారు. అనంతరం ఎంపీగా కడియం కావ్య ప్రమాణ స్వీకారం చేస్తారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో ఎంపీ కడియం కావ్య గళం విప్పుతారని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వివాహేతర సంబంధం పెట్టుకొని ఆపై మహిళను హత్య చేసిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. సుబేదారి CI వివరాల ప్రకారం.. స్టే.ఘ వాసి మంజులకు, HNK వాసి అశోక్‌తో పెళ్లైంది. కాగా వీరి మధ్య గొడవలు రావడంతో సర్దిచెప్పడానికి వచ్చిన పంచాయితీ పెద్ద మనిషి వెంకటస్వామి ఆమెను లొంగదీసుకొని 2ఏళ్లగా సహజీవనం చేస్తున్నాడు. ఈనెల 21న మంజుల, వెంకటస్వామి ఫోన్‌లో గొడవ పడ్డారు. దీంతో ఆమెను హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
దేవరుప్పుల మండలానికి చెందిన యువకుడు లోడంగి అశోక్ తన రక్తంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి చిత్రాన్ని గీసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యేకు చిత్రపటాన్ని అశోక్ అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
కేయూ బీఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షలు నేటి(సోమవారం) నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 24, 26, 28, జులై 1వ తేదీల్లో నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లాలో రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ 420/20-22 KM రాయి వద్ద రైలు కింద పడి కిష్టాపురం గ్రామానికి చెందిన కొంగరి సునీల్(34) మృతి చెందినట్లు రైల్వే పోలీసులు చెప్పారు. బంధువులకు సమాచారం ఇచ్చి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ శివారులోని పాటిగడ్డమీద తండాలో ఓ పురాతన నాణెం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. ఇక్ష్వాకుల కాలంలో ముద్రించిన ఈ నాణెంపై గుర్రం గుర్తుతో పాటు అర్ధ వృత్తాకారం బ్రహ్మలిపిలో ఉందని చరిత్రకారుడు రత్నాకర్ రెడ్డి తెలిపారు. గుర్రం గుర్తు ఉన్న వీటిని ‘మహా తలవర నాణేలు’ అంటారని పేర్కొన్నారు.
ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లిలో శనివారం రాత్రి క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన అచ్చ లక్ష్మీనర్సయ్య- తిరుమల దంపతులు ఏప్రిల్ 6న ఏటూరునాగారం మండలంలో గృహం నిర్మించుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. కాగా అదే ఆహ్వానం కార్డుతో వారంటే గిట్టని వారు గ్రామంలో గృహప్రవేశం ఆహ్వాన కార్డుకు నల్ల కోడి, కోడిగుడ్డు, గుమ్మడి, మిరపకాయలు, బొమ్మలు తదితర వస్తువులు పెట్టి పూజలు చేశారు.
Sorry, no posts matched your criteria.