India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లిలో శనివారం రాత్రి క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన అచ్చ లక్ష్మీనర్సయ్య- తిరుమల దంపతులు ఏప్రిల్ 6న ఏటూరునాగారం మండలంలో గృహం నిర్మించుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. కాగా అదే ఆహ్వానం కార్డుతో వారంటే గిట్టని వారు గ్రామంలో గృహప్రవేశం ఆహ్వాన కార్డుకు నల్ల కోడి, కోడిగుడ్డు, గుమ్మడి, మిరపకాయలు, బొమ్మలు తదితర వస్తువులు పెట్టి పూజలు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉరేసుకొని మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని సుభాశ్ కాలనీలో జరిగింది. మృతదేహం కుళ్లిపోయి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు కొండపర్తి శివగా పోలీసులు గుర్తించారు.
మల్టీ జోన్ 1 పరిధిలో పని చేస్తున్న 19 మంది CIలను బదిలీ చేస్తూ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏవి.రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని భూపాల్ పల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌లు బదిలీ అయ్యారు.
ములుగు SB విభాగంలో విధులు నిర్వహిస్తున్న శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మల్టీజోన్ IG రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా.. 2022-23లో KMM 2 టౌన్ CIగా ఉన్న సమయంలో ఓ వ్యక్తిని బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో కేసు నమోదు చేశారు. 2022లో నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కోర్టును తప్పుదోవ పట్టించినట్లు ఫిర్యాదు వచ్చింది. ఈమేరకు విచారణ జరిపి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, పాలనను పరుగులు పెట్టించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. విధులకు వన్నె తెచ్చేలా అధికారులు పనిచేయాలని, జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉద్యోగులదేనని, నిజాయితీగా కష్టపడి పని చేసే అధికారులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
గోవిందరావుపేట మండలం చల్వాయి వట్టెవాగులో దెయ్యం సంచరిస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐదారు నెలల నుంచి వట్టెవాగులో దెయ్యం తిరుగుతుందంటూ ప్రచారం సాగుతోంది. అయితే దెయ్యం ఫొటో అని చెబుతూ ఓ చిత్రాన్ని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికంగా ప్రభుత్వ అధికారులు ఇలాంటి ప్రచారంపై అవగాహన కల్పించి ప్రజల్లోని అభద్రతాభావాన్ని పోగొట్టాలని కోరుతున్నారు.
MLA యశస్విని రెడ్డికి కనీసం మన భారతదేశ పటం పైన అవగాహన లేకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్‌లో తప్పులు ఉన్నాయన్నారు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పి మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు రాకేశ్ రెడ్డి సూచించారు.
స్టేషన్ ఘనపూర్: తనను కలిసేందుకు వచ్చే ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు శాలువాలు, బొకేలు తీసుకురావద్దని నోటు పుస్తకాలు, స్టేషనరీ తీసుకురావాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు పుస్తకాలు అందించేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని, విద్యా రంగ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై లైంగిక దానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. రక్షణ కల్పించాల్సిన పోలీసుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కొందరు పోలీసుల వైఖరి పోలీసు శాఖకు తలవంపులు తెస్తోంది. కొంతమంది తరచూ ఏదోచోట వివాదాల్లో తల దూర్చి వార్తల్లో నిలుస్తున్నారు.
అత్తగారి ఇంటిపై అల్లుడు దాడి చేసిన ఘటనలో ఆరుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన ఆరూరి అనితకు నెల్లుట్లకి చెందిన ఉమేందర్‌తో వివాహం జరిగింది. ఉమేందర్ అనితను అదనపు కట్నం తేవాలని వేధిస్తుండగా పుట్టింటికి వెళ్ళింది. దీంతో ఉపేందర్ తన స్నేహితులతో కలిసి అత్తారింటిపై దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.