Warangal

News May 10, 2024

రేపు సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్: సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఉత్వర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13 సాయంత్రం 6 గంటల వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.

News May 10, 2024

ములుగు: ఎన్నికలను బహిష్కరించాలని వాల్ పోస్టర్లు

image

ములుగు జిల్లాలో మావోయిస్టు వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వాజేడు మండలం జగన్నాథపురంలోని వై-జంక్షన్ వద్ద మావోయిస్టు వాల్ పోస్టర్లు వెలిశాయి. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని, హిందుత్వ ఫాసిస్టు బీజేపీ, ఆ పార్టీతో అంటకాగుతున్న ఇతర పార్టీలను తరిమికొట్టాలని వెంకటాపురం-వాజేడు ఏరియా మావోయిస్టు కమిటీ పేరుతో లేఖను విడుదల చేశారు. ఈ వాల్ పోస్టర్లతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

News May 10, 2024

వరంగల్: బాధితురాలి ఆత్మహత్యాయత్నం

image

ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు తెలియకుండానే గర్భసంచి తొలగించారని ఇటీవల ఓ మహిళ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. శుక్రవారం సదరు మహిళ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం నిద్రమాత్రలు మింగింది. ఆమెను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు.

News May 10, 2024

వరంగల్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రంగాపురం గ్రామానికి చెందిన గుర్రం సునీల్(32) ఇంట్లో విద్యుత్ మోటార్‌ను రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టింది. కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News May 10, 2024

మహబూబాబాద్: చింతగడ్డ తండాలో గుప్త నిధుల తవ్వకాలు

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం చింతగడ్డ తండాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. తన పొలంలో గుప్తనిధులు ఉన్నాయని, అక్కడ తవ్వకాలు జరపాలని కొంతమంది తనను అడిగారని, తాను నిరాకరించినట్లు రైతు వెంకటేశ్ తెలిపారు. ఈ క్రమంలో గురువారం పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లగా పెద్దగుంత తీసి ఉన్నట్లు గమనించాడు. JCBతో తవ్వకాలు చేపట్టినట్లు గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News May 10, 2024

యూపీఎస్సీ ఫలితాల్లో జనగామ విద్యార్థికి 135వ ర్యాంకు

image

యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఫలితాల్లో జనగామ పట్టణానికి చెందిన భరత్ కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 135వ ర్యాంకు సాధించారు. పదోతరగతి జనగామలో ప్రైవేటు స్కూల్లో, హైదరాబాద్లో ఇంటర్, మద్రాస్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్ వైపు అడుగేసి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు.

News May 10, 2024

వరంగల్: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకురాలు మృతి

image

రోడ్డు ప్రమాదంలో మహాముత్తారం కాంగ్రెస్ మండల <<13216465>>అధ్యక్షురాలు <<>>మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆమె కాంగ్రెస్‌ నాయకులతో కలిసి మహాముత్తారంలో కీర్తిబాయి(45) ప్రచారం నిర్వహించారు. అనంతరం పెగడపల్లిలో ప్రచారం నిర్వహించడానికి ఆమె భర్తతో కలిసి కారులో వెళ్తుండగా నిమ్మగూడెం వద్ద కారు అదుపుతప్పి మట్టి కుప్పను ఢీకొట్టింది. దీంతో కీర్తిబాయి అక్కడికక్కడే మృతిచెందారు.

News May 10, 2024

కులంపై మేము ఎలాంటి విచారణకైనా సిద్ధం: కావ్య

image

కులంపై మేము ఎలాంటి విచారణకైనా సిద్ధమని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావ్య అన్నారు. హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పదేపదే మా కులం ప్రస్తావన తీసుకువచ్చి కొంత మంది నేతలు రాజకీయ లబ్ధిపొందుతున్నారని, జాతీయ స్థాయి కమిషనే కాదు, ఏ కమిటితో విచారణ జరిపినా మేము సిద్ధమే అని అన్నారు. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అయిందని కావ్య అన్నారు.

News May 9, 2024

FLASH.. WGL: రైలు ఎక్కేందుకు వచ్చి గుండెపోటుతో మృతి

image

వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మంచిర్యాలకు చెందిన మొహమ్మద్ ఇక్బాల్(58)గా పోలీసులు, రైల్వే సిబ్బంది గుర్తించారు. వరంగల్ నుంచి మంచిర్యాలకు వెళ్లేందుకు నవజీవన్ రైలు ఎక్కుతుండగా ఈ విషాద సంఘటన జరిగింది.

News May 9, 2024

మోదీ, ఆరూరి రమేశ్‌కు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలి: కావ్య

image

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ ప్రజలు మోదీ, ఆరూరి రమేశ్‌కు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. హన్మకొండలో బీసీ సంఘం సమావేశంలో కావ్య మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల బతుకులు చీకటి మయమవుతాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికలు తెలంగాణకు, గుజరాత్‌కు మధ్య జరుగుతున్న యుద్ధమని తెలిపారు.