India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన అంకిత(15) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. గ్రామస్థులు, కుటుంబీకుల వివరాల ప్రకారం.. అంకిత ఇంట్లో ఉంటూ మొబైల్ ఫోన్లో వీడియోలు చూస్తూ, తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండగా తల్లి గమనించి పలుమార్లు మందలించింది. దీంతో అంకిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌గా విజయభాను బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని చార్మినార్ డివిజన్ డిప్యూటీ ఆర్.ఎంగా పనిచేసిన విజయభాను పదోన్నతిపై వరంగల్ ఆర్.ఎంగా బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన శ్రీలత రంగారెడ్డి ఆర్.ఎంగా బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన విజయభానును ఆర్టీసీ అధికారులు, కార్మిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఇకనుంచి ప్రతి బుధవారం ఓపెన్ ఉండనుంది. ఎండాకాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మూడు నెలల క్రితం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల విజ్ఞప్తి మేరకు ప్రతి బుధవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. ఇక ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆ సెలవులు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విషయాన్ని రైతులు గమనించి బుధవారం సైతం మార్కెట్‌కు సరుకులు తీసుకొని రావచ్చన్నారు.
పురుగు మందు తాగి ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో జరిగింది. స్థానికుల ప్రకారం.. తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన అంకిత(15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. అప్పుడే వచ్చిన కుటుంబీకులు గమనించి ములుగు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కాగా, అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్‌పై గన్ చూపెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. భవాని సేన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ కీచక ఎస్ఐ లైంగిక వేధింపుల ఆరోపణ వెలుగులోకి వచ్చాయి. కాటారం సబ్‌డివిజన్‌లోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహిళ కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించేవాడని ఆమె ఫిర్యాదు చేసింది. కాగా సదరు ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు సమాచారం. ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ డీఎస్పీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల పరీక్షలు జరుగుతున్నాయి. జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాలలో ఇద్దరు వ్యక్తులు ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తుండగా తనిఖీ అధికారులు డిబార్ చేసినట్లుగా పరీక్షలు నియంత్రణ అధికారి ప్రొఫెసర్ శ్రీ రామోజు నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ నరేందర్లు తెలిపారు. వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పై విధులు నిర్వర్తిస్తున్న టెక్నికల్ సపోర్ట్ ఇంజినీరింగ్ సురేశ్ పై వేటు పడింది. అతడిని విధుల నుంచి తప్పిస్తూ హనుమకొండ డీటీసీ శ్రీనివాస్ పుప్పాల ఆదేశాలు జారీ చేశారు. మద్యం తాగి విధులకు హాజరయ్యారనే ఆరోపణలపై సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు డీటీసీ తెలిపారు.
ఏటూరునాగారం మండల కేంద్రంలో ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఐటిడిఏ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఐటిడిఏ అధికారి చిత్రా మిశ్రా పాల్గొన్నారు.
వరంగల్ నగరంలోని ఇంతేజార్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం అందజేసినట్లు సీఐ శివ కుమార్ తెలిపారు. మృతుడికి సుమారు 40-45 ఏళ్లు ఉంటాయని, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్లు పేర్కొన్నారు. వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.
Sorry, no posts matched your criteria.