Warangal

News May 9, 2024

భూపాలపల్లి: తండ్రి బీట్ ఆఫీసర్.. కుమారుడు IFS 

image

యూపీఎస్సీ బుధవారం ప్రకటించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామానికి చెందిన పోరిక లవ కుమార్ విజయ కేతనం ఎగరవేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన లవ కుమార్ 2017 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నిన్న విడుదల చేసిన ఫలితాల్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. లవ కుమార్ తండ్రి సూరి దాస్ సైతం అటవీ శాఖలో బీట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.

News May 9, 2024

కాజీపేట: ఊయల కట్టిన స్టూల్‌ మీద పడి చిన్నారి మృతి

image

ఊయల కట్టిన స్టూల్‌ మీద పడి చిన్నారి మృతి చెందింది. ఛత్తీస్‌గఢ్‌‌కు చెందిన లోక్‌నాథ్‌ ఖర్ష్‌ తాపీమేస్త్రీ-భారతి దంపతులకు ముగ్గురు పిల్లలు. నాలుగేళ్ల కిందట కుటుంబంతో సహా కాజీపేటకు వలస వచ్చారు. ఆయన భార్య సోమిడిలో నిర్మాణంలో ఉన్న ఇంటి దర్వాజ, ఇనుప స్టూలుకు చీరతో ఊయల కట్టి చిన్నారి రోషిత (6 నెలలు)ను అందులో పడుకోబెట్టింది. స్టూల్‌ అదుపు తప్పడంతో ఊయలలో ఉన్న చిన్నారి కిందపడి గాయాల పాలై చనిపోయింది.

News May 9, 2024

రేపు ఒక్కరోజే వరంగల్ మార్కెట్ ఓపెన్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు(గురువారం) ప్రారంభం కానుంది. నేడు అమావాస్య, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు సెలవు ప్రకటించారు. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. ఉదయం నుంచి మార్కెట్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
గమనిక: శుక్రవారం నుంచి మార్కెట్‌కు వరుసగా 6 రోజులు సెలవులు రానున్నాయి.

News May 8, 2024

రేపు తొర్రూర్‌కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

image

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు తొర్రూరుకు రానున్నారు. బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్‌కి మద్దత్తుగా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఉ.10 గం.లకు జరిగే ఈ సభను విజయవంతం చేయాలని స్థానిక బీజేపీ శ్రేణులు కోరారు. ఇప్పటికే ఆయనకు రాకకు సంబంధించి ఏర్పాట్లు చేశారు.

News May 8, 2024

నెక్కొండ: రైలుకింద పడి యువకుడు మృతి

image

ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు జరిగింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేషన్‌కి కొంతదూరంలో మంద రమేష్(29) అనే వ్యక్తి ఈరోజు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాయపర్తి మండలం కొత్తూరు గ్రామస్థుడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.

News May 8, 2024

WGL: ఈనెల14 వరకు దరఖాస్తుకు అవకాశం

image

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలీసెట్ 2024కు రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏఎస్బిటిఈటి కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. దరఖాస్తు చేసుకొని వారు, ఆసక్తిగల విద్యార్థులు సత్వరమే తమ దరఖాస్తులు నమోదు చేసుకోవాలని సూచించారు.

News May 8, 2024

వరంగల్ మార్కెట్‌కు 6 రోజుల వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 6 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 13న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 10(శుక్రవారం) నుంచి 15(బుధవారం) వరకు 6రోజుల సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి మార్కెట్ 16(గురువారం)న ప్రారంభం కానుంది. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని కోరారు.

News May 8, 2024

WGL: ప్రధాని మోదీకి గద బహుకరణ

image

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు ప్రధానమంత్రికి గదను బహుకరించారు. వారి కోరిక మేరకు నరేంద్ర మోదీ గదను ఎత్తి, ప్రజలకు అభిమానం చేశారు. ఈ సన్నివేశాన్ని చూసిన కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ‘జై మోదీ’ అంటూ నినాదాలు చేశారు.

News May 8, 2024

వరంగల్: చిన్నారిని ముద్దాడిన ప్రధాని మోదీ

image

రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో మామునూర్‌లో భారీ జన సభ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తకు చెందిన ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ చిన్నారిని ప్రధాని ఆప్యాయంగా ముద్దాడారు.

News May 8, 2024

వరంగల్: అకాల వర్షం.. రైతన్న ఆగమాగం!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. కుండపోత వాన పడటంతో మార్కెట్, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఎక్కడికక్కడ ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు పశువులు మృత్యువాత పడ్డాయి.