Warangal

News June 18, 2024

నేటి నుంచి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శన వేళల్లో మార్పులు

image

పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శన వేళలను పునరుద్ధరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పుల వల్ల భక్తులు, అర్చకులు సిబ్బంది సౌకర్యార్థం మార్పులు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 4 గంటల వరకు విరామ సమయంగా నిర్ణయించారు. ఉదయం 6:30 గంటల నుంచి 1:30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులు దర్శనాలు వివిధ పూజలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News June 18, 2024

పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటా: అందే శ్రీ

image

తాను పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటానని తమ గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని కవి అందె శ్రీ అన్నారు. శనివారం తన స్వగ్రామమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలం రేబర్తి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల అవసరాలను, గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందెశ్రీ రాసిన గేయం జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించిన సందర్భంగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.

News June 17, 2024

BREAKING.. వరంగల్: పిచ్చికుక్కల దాడిలో పసికందు మృతి

image

మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. తొర్రూరు మండలం మడిపల్లిలో పిచ్చికుక్కల దాడిలో నెలరోజుల పసికందు మృతి చెందింది. ఇంట్లో నిద్రిస్తున్న 42 రోజుల బాబుపై కుక్కదాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు. తల్లి వంట చేస్తూ ఆదమరిచి ఉన్నప్పుడు కుక్క దాడి చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 17, 2024

జాబ్ మేళాలో 58 కంపెనీలు పాల్గొంటాయి: సీతక్క

image

ఈనెల 19న ములుగు జిల్లాలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. జాబ్ మేళాలో 58 కంపెనీలు పాల్గొంటాయని, 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు, వృత్తి విద్య కోర్సులు చేసిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి వెంటనే ఉద్యోగాల్లో చేర్చుకోవడం జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు.

News June 17, 2024

వరంగల్ ఎనుమాముల మార్కెట్ రేపు పున:ప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున:ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు, నేడు బక్రీదు పండుగ కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News June 17, 2024

WGL: నకిలీ ఐడీలతో ఇన్‌స్టాగ్రాంలో బెదిరింపులు!

image

నకిలీ ఐడీలతో ఇన్‌స్టాగ్రాంలో సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. శంభునిపేటకు చెందిన ఉపాధ్యాయుడు నీలం రాజు సెల్‌‌ఫోన్‌లోని ఇన్‌స్టాగ్రాం యాప్‌నకు నకిలీ ఐడీల ద్వారా అసభ్య సందేశాలు పంపిస్తూ..15 రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాజుకు సంబంధించిన ఫొటోలు మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు పంపిస్తూ రూ.30 వేలు ఇస్తే సందేశాలు ఆపుతామంటూ డిమాండ్ చేస్తున్నారు.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News June 17, 2024

మా అత్తయ్యే గేమ్ ఛేంజర్: వరంగల్ కలెక్టర్

image

తన జీవితంలో గేమ్‌ ఛేంజర్‌ అత్తయ్య విజయలక్ష్మినే అని WGL కలెక్టర్‌ డా.సత్య శారదాదేవి అన్నారు. తాను పరిశోధనల్లో ఉన్నపుడు.. ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాలు రాయాలని అత్తయ్యే సూచించారని చెప్పారు. HYDకు చెందిన ఈమె HCUలో జెనెటిక్స్‌లో పీహెచ్‌డీ, CCMBలో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోగా పని చేశారు. అనంతరం గ్రూప్-1 రాసి ప్రభుత్వ సర్వీసులోకి వచ్చారు. కలెక్టర్ భర్త వరప్రసాద్‌ HYD సిటీ కాలేజీలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌.

News June 17, 2024

మహబూబాబాద్: ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ఒకరి మృతి

image

మహబూబాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. బయ్యారం మండలం కోటగడ్డలో ప్రేమికులు ప్రవళిక, రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రవళిక ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలుసుకున్న రవీందర్ కత్తితో గొంతు కోసుకున్నాడు. రవీందర్ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక మృతదేహం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News June 17, 2024

ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYD నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో విద్యా సంవత్సరానికి డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమో కోర్సుల్లో చేరడానికి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాము యాదవ్ తెలిపారు.ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ ద్వారా ఫీజుల్లో రాయితీ కల్పించడానికి ఈ నెల 23న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైనా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 17, 2024

హనుమకొండ: యువతిపై అత్యాచారం?

image

HNK జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(25)పై అదే గ్రామానికి చెందిన యువకుడు (27) అత్యాచారం చేసినట్లు సమాచారం. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. అవివాహితులైన వీరిద్దరూ బంధువులు కావడం గమనార్హం.బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.