Warangal

News May 6, 2024

యువత రాజకీయాల్లోకి రావాలి: KCR

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నల్గొండ కలెక్టరేట్లో ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేయనున్నారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆయన పార్టీ బీ ఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నిక కచ్చితంగా గెలవబోతున్నామని, నీ వెంట పార్టీ యంత్రాంగం, నాయకత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. విద్యావంతులు, నిజాయితీ పరులు, యువత రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందన్నారు.

News May 6, 2024

MHBD: తల్లి గెలుపు కోసం తట్ట ఎత్తిన కూతురు

image

మహబూబాబాద్ మండలం ఇస్లావత్ తండాలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ప్రచారం నిర్వహించారు. ఇందులో మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కవిత కూతురు మహతి ప్రచారంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి, తన తల్లికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కవిత కూతురు మహతి మట్టి తట్ట నెత్తిన పెట్టుకొని కాసేపు ముచ్చటించారు.

News May 6, 2024

WGL: పురుగు మందు తాగిన తండ్రి మృతి

image

HNK జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురానికి చెందిన కుమారస్వామి, అతని కూతురు శ్రీవిద్య పురుగు మందు తాగి <<13193945>>ఆత్మహత్యాయత్నానికి<<>> పాల్పడ్డ విషయం తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. కూతురు చదువు విషయమై ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశంలో పురుగు మందు సేవించిన తండ్రి మృతి చెందాడు. కూతురి పరిస్థితి విషమం కావడంతో పరకాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

News May 6, 2024

నేను పక్కా లోకల్ అభ్యర్థిని: సుధీర్ కుమార్

image

నేను పక్కా లోకల్ అభ్యర్థినని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్‌కు వస్తున్న ఆదరణను చూడలేకనే, నేను నాన్ లోకల్ అంటూ కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని సుధీర్ కుమార్ మండిపడ్డారు.

News May 6, 2024

BREAKING.. హన్మకొండ జిల్లాలో విషాదం

image

హన్మకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురంలో విషాదం చోటుచేసుకుంది. పురుగు మందు తాగి తండ్రి, కూతురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో తండ్రి కుమారస్వామి(43) మృతి చెందగా.. కూతురు శ్రీవిద్య(16) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, శ్రీవిద్యను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 6, 2024

కడియం కావ్యకు టికెట్ ఇచ్చినందుకే పార్టీ మారాను: ఆరూరి

image

పార్టీ మార్పుపై వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ స్పందించారు. తాటికొండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కడియం కావ్యకు టికెట్ ఇచ్చినందుకే తాను బీఆర్ఎస్ నుంచి పార్టీ మారినట్లు తెలిపారు. కడియం శ్రీహరి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదని, వరంగల్ జిల్లాలో దళితులకు అన్యాయం చేసిన మొదటి వ్యక్తి కడియం శ్రీహరి మండిపడ్డారు. 

News May 6, 2024

రూ.4,500 పెరిగిన టమాటా మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటా రూ.17,100 పలకగా, 341 రకం మిర్చి రూ.16 వేల ధర పలికింది. అలాగే వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.14 వేలు, 5531 రకం మిర్చికి రూ.12 వేల ధర వచ్చింది. మరోవైపు టమాటా మిర్చి గత వారంతో పోలిస్తే భారీగా పెరిగింది. గతం శుక్రవారం రూ. 31 వేల ధర పలికిన టమాటా మిర్చి.. ఈరోజు రూ.35,500 పలికింది.

News May 6, 2024

వరంగల్: పత్తి ధర క్వింటా రూ.6,725

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ నేడు ప్రారంభం కాగా పత్తి భారీగా తరలివచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పత్తి ధర పడిపోయింది. శుక్రవారం రూ.6,840 పలికిన క్వింటా పత్తి .. ఈరోజు రూ.6,725కి పడిపోయింది. ధరలు దారుణంగా పడిపోతుండడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

News May 6, 2024

వరంగల్: నీట్‌కు 5,087 మంది విద్యార్థులు హాజరు

image

వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా ముగిసినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంజుల దేవి ప్రకటనలో తెలిపారు. మొత్తం 5,205 మంది విద్యార్థులకు గాను 5,087 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

News May 6, 2024

ములుగు: పిడుగుపాటు.. భార్యాభర్తలకు గాయాలు

image

ములుగు జిల్లా వాజేడు మండలం బొల్లారం గ్రామంలో పిడుగు పాటుకు విద్యుత్ స్తంభం కూలి పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఇంటికి మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న భార్యాభర్తలు కంతి చిలకమ్మ, లింగయ్యకు స్వల్ప గాయలయ్యాయి. గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.