India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు గురువారం మామునూర్ ఎయిర్ పోర్ట్ స్థల పరిశీలన చేశారు. అనంతరం మామునూర్ పరిసర ప్రాంతాలైన గుంటూరుపల్లి, గాడిపల్లి, నక్కలపల్లి రైతులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర మళ్లీ తగ్గింది. నేడు క్వింటా కొత్త పత్తి ధర రూ.6,910కి పడిపోయింది. సోమవారం రూ.6,910 ధర పలికిన క్వింటా కొత్త పత్తి ధర.. మంగళవారం రూ.6,920కి చేరి, మళ్లీ బుధవారం పెరిగి రూ.6,930 అయింది. నేడు మళ్లీ తగ్గి రూ.6,910కి చేరింది. దీంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువును ఈ నెల 11 వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిణి తిరుమలాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం రూ.50తో ఈ నెల 13 వరకు పొడిగించినట్లు చెప్పారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ చూడాలని పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లా సమీకృత భవనంలో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లతో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, కడియం కావ్య, గుండు సుధారాణి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లాపై ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నట్లు నేతలు తెలిపారు.
వైటిడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఎంఎయుడి ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి బీసీలు, కులవృత్తుల సంక్షేమం పట్ల ఎంతో చిత్తశుద్ధి ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ గౌడన్నలకు కటమయ్య కిట్లను పంపిణీ చేశారు. కల్లుగీత కార్మికులు చెట్లు ఎక్కేటప్పుడు అనేక ప్రమాదాలకు గురయ్యేవారని, దీంతో వారి కుటుంబాలు అనేక ఇబ్బందులకు గురయ్యేవని మంత్రి పేర్కొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం లాగే ఈరోజు సైతం మిర్చి ధరలు తటస్థంగా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.16,800 ధర రాగా.. నేడు సైతం అదే ధర వచ్చింది. మరోవైపు 341 రకం మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.15 వేల ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ మిర్చికి నిన్న రూ.15,000 ధర రాగా, ఈరోజు రూ.500 తగ్గి రూ.14,500కి చేరిందని అధికారులు తెలిపారు.
జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన బక్కయ్య(52) అనే రైతు మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించాడు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బక్కయ్య ఆకస్మిక మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
WGLలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) ఒప్పంద ప్రాదిపదికన లైబ్రరీ ట్రైనీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ తెలిపారు. అభ్యర్థులు ఎంఎల్ఐఎస్సీలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. నెలకు రూ.20వేల వేతనం, అభ్యర్థుల వయసు 28సం.లు మించొద్దన్నారు.
ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించాల్సిన తేదీలను, ఫీజుల మొత్తం వివరాలను ఇంటర్ బోర్డు జారీ చేసిందని డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్ బోర్డు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 25 తేదీలోగా ఫీజులు చెల్లించవచ్చని అన్నారు.
Sorry, no posts matched your criteria.