Warangal

News February 20, 2026

వరంగల్: తనిఖీలు లేకనే .. ఉపాధ్యాయుల గైర్హాజరు!

image

ప్రభుత్వ పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు లేనందునే ఉపాధ్యాయులు విధులకు హాజరై డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. జిల్లాలోని నెక్కొండ మండలంలో ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డీఈవో రంగయ్య నాయుడు శుక్రవారం సస్పెండ్ చేసిన క్రమంలో విద్యాశాఖ అధికారులు ఇన్నాళ్లకు మేల్కొన్నారా..!? అంటున్నారు. కొందరు హెచ్ఎంల కారణంగానే టీచర్లు డుమ్మా కొడుతున్నట్లు చర్చ సాగుతోంది.

News February 20, 2026

WGL: ప్రత్యేక తరగతులపై కొరవడిన పర్యవేక్షణ!

image

జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఒక వైపు కలెక్టర్ చెబుతున్న.. మరోవైపు ప్రత్యేక తరగతుల నిర్వహణ అధ్వానంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం 8-9, సాయంత్రం 4.15 -5.15 గంటల వరకు స్పెషల్ క్లాస్‌లు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా, వాటిపై పర్యవేక్షణ లేదు. గతంలో మాదిరిగా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బందిచే ఇన్విజిలేటర్ డ్యూటీస్, టెస్టులు నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

News February 20, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: డీఐఈఓ శ్రీధర్ సుమన్

image

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ల (డీఓ)తో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 6,003 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు.

News February 20, 2026

నెక్కొండలో ఇద్దరు ఉపాధ్యయులు సస్పెండ్

image

వరంగల్ జిల్లా నెక్కొండ మండల పరిధిలో పని చేస్తున్న ఇద్దరు ఎస్జీటీ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డీఈవో రంగయ్య శుక్రవారం ఉత్తర్వులు జరీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవుతున్న అంకం ప్రవీణ్ కుమార్, రామారపు రవి సస్పెండ్ అయ్యారు. ప్రవీణ్ కుమార్ అజ్మీర మంగ్యా తండా MPPS, రవి గొట్లకొండ MPPSలలో ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్నారు.

News February 19, 2026

మిర్చి నాణ్యతపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

మార్కెట్‌లో మిర్చికి మంచి ధరలు ఉన్నప్పటికీ, రైతులు నాణ్యతపై దృష్టి పెట్టకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హెచ్చరించారు. ఎనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి సీజన్ పరిస్థితులపై ఆమె సమీక్ష నిర్వహించారు. తేమతో కూడిన మిర్చిని తీసుకురావడం వల్ల రంగు మారి నాణ్యత దెబ్బతింటోందని, ఫలితంగా విదేశీ వ్యాపారులు కొనుగోలుకు విముఖత చూపుతున్నారని పేర్కొన్నారు.

News February 19, 2026

10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలి: కలెక్టర్

image

జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈవోలు, హెడ్ మాస్టర్లతో డీఈఓ రంగయ్య నాయుడుతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9,492 మంది ఉన్నారని, ఫలితాల మెరుగుదలకు పాఠశాల స్థాయిలో ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని హెడ్ మాస్టర్లను ఆదేశించారు.

News February 18, 2026

అంగన్వాడీ సూపర్‌వైజర్లు నిర్లక్ష్యం వీడాలి: కలెక్టర్

image

అంగన్వాడీ సూపర్‌వైజర్లు పని తీరులో నిర్లక్ష్యం, లక్ష్యాలు సాధించడంలో వెనుకబడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా.సత్య శారద హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ పని తీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొంతమంది సూపర్‌వైజర్లపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. CDPOలు అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి, సేవల అమలుపై సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు.

News February 18, 2026

రైతుల సాగు వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్

image

రైతుల పంటల సాగును ఏఈఓలు సందర్శించి సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనురాధతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులతో ఫార్మర్ రిజస్టరీ, క్రాప్ బుకింగ్, యూరియా నిల్వలు, రైతుబీమాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏఈఓలు వారి పరిధిలోని గ్రామాలలో రైతుల రిజిస్టర్‌కు సంబంధించి ఐడి క్రియేట్ చేయాలన్నారు.

News February 18, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలి: WGL కలెక్టర్

image

ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాల్లో 12,166 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వంటి కనీస వసతుల్లో లోటు ఉండకూడదని స్పష్టం చేశారు.

News February 17, 2026

రీ-సర్వే వేగవంతం చేయాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో నక్షలు లేని గ్రామాల్లో భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రీ-సర్వే పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు. నక్షలు లేని గ్రామాల్లో భూసర్వే ఖచ్చితత్వంతో పూర్తి చేసి, భూ వివాదాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.