Warangal

News May 6, 2024

వరంగల్: రేపు రేవంత్.. ఎల్లుండి మోదీ

image

లోక్‌సభ ఎన్నికలు మరో వారం రోజుల్లో ఉండటంతో వరంగల్‌‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల అగ్రనేతలు పర్యటించారు. మరోసారి కాంగ్రెస్ WGL అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 7న రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. WGL, MHBD అభ్యర్థులకు మద్దతుగా ఈ నెల 8న ప్రధాని మోదీ మామునూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

News May 6, 2024

వరంగల్: వడదెబ్బతో రైతు మృతి

image

వడదెబ్బకు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొర్రి బిక్షపతి (40) తన వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి పనులు చేసుకున్నాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లి చెట్టుకింద సేదతీరాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 6, 2024

వరంగల్: నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో II, IV, VI సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 1,70,991 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 122 పరీక్ష కేంద్రాలను, 8 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

News May 6, 2024

WGL: లోక్‌సభ ఎన్నికలకు సమయం పెంపు: రిటర్నింగ్ అధికారి

image

ఈనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందు వలన పోలింగ్ సమయం పొద్దున్న 7నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుందన్నారు.. ప్రజలు పెంచిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

News May 5, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో TODAY టాప్ న్యూస్

image

* > ముగిసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తల్లి లచ్చిభాయ్ అంతక్రియలు
* > ములుగు, MHBD, జనగామ జిల్లాల్లో కురిసిన వర్షాలు
* > ఎటునాగారం, రఘునాథపల్లిలో పిడుగు పడి ఇద్దరు మృతి
>* WGL: ముగిసిన నిట్ పరీక్ష.. పలుచోట్ల ఇబ్బందులు
* > మరిపెడలో కాంగ్రెస్ సమావేశం..పాల్గొన్న మంత్రి తుమ్మల
* > MHBD, వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన BSP రాష్ట్ర అధ్యక్షుడు
>* జిల్లాలో విస్తృతంగా కొనసాగిన ఎన్నికల ప్రచారం

News May 5, 2024

జనగామ: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

జనగాం పట్టణంలోని రైల్వేస్టేషన్ ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం దొరికింది. 70 నుంచి 80 ఉండొచ్చు. మృతుడిపై ఆకుపచ్చ రంగు లుంగీ, నిండు చేతుల తెలుపు రంగుచొక్కా వుంది. తెల్లని గడ్డం కలిగి ఉన్నాడు. డెడ్ బాడీని ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 5, 2024

ములుగు: పిడుగుపాటుతో రైతు మృతి

image

ములుగు జిల్లా ఏటూరునాగారంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై రైతు మృత్యువాత పడ్డాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది ఈ క్రమంలో ఓడవాడ సమీపంలోని మిర్చి కల్లం వద్దకు బరకాలు కప్పేందుకు వెళ్తున్న రైతు బాస బుల్లయ్య పిడుగుపాటుకు గురయ్యాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

News May 5, 2024

వరంగల్: మొత్తం 11 నామినేషన్లు

image

వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మూడోరోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 11కు చేరింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ వేయగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

News May 5, 2024

ఎవరికో ‘వరం’గల్‌..!

image

ఎస్సీలకు రిజర్వ్‌ అయిన వరంగల్ లోక్‌సభ స్థానంలో మొత్తం 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధానంగా కాంగ్రెస్‌, BRS, BJPల మధ్యే గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్‌ నుంచి కడియం కావ్య, BJP నుంచి అరూరి రమేశ్‌, BRS నుంచి సుధీర్‌కుమార్‌లు తలపడుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం వేళల్లో కల్యాణ మండపాల్లో సమావేశాలు నిర్వహించి గెలిస్తే తామేం చేస్తామో వివరిస్తున్నారు.

News May 5, 2024

HNK: వరకట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని సూసైడ్

image

వరకట్నం వేధింపులు, కుటుంబ కలహాలతో ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HNKలో జరిగింది. పోలీసుల వివరాలు.. ములుగు జిల్లా మంగపేట మం. బోరు నర్సాపూర్‌‌కు చెందిన రాంనర్సయ్యకు ఏటూరునాగారంకు చెందిన సఫియా(38)తో వివాహమైంది. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. రాంనర్సయ్య చెడు వ్యసనాలకు బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధించాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని హింసించడంతో సఫియా శనివారం ఉరేసుకుంది.