Warangal

News May 5, 2024

WGL: బిర్యాని సెంటర్‌లో వెయిటర్ అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పద స్థితిలో వ్యకి మృతి చెందిన ఘటన ఆదివారం నెక్కొండ మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఓ బిర్యాని సెంటర్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న కుమారస్వామి అదే హోటల్‌లో మ‌ృతి చెందాడు. చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వంటిపై గాయాలున్నాయని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

News May 5, 2024

MHBD: ఒకే వీధి.. తండ్రిది AP.. కుమారుడిది తెలంగాణ

image

ఒకే వీధిలో ఉన్న ఆ తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. ఉమ్మడి APలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. విజభన తర్వాత ఆయన అరకు లోక్‌సభ పరిధిలోకి వచ్చింది. మరోవైపు అదే వీధిలో రోడ్డుకు అటువైపున ఆయన కుమారుడు ఇల్లు కట్టుకుంటుండగా అది మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలో ఉండటం విశేషం.

News May 5, 2024

నేడు నీట్ పరీక్ష.. 5,445 మంది విద్యార్థులు

image

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్- 2024 పరీక్ష ఆదివారం జరగనుంది. పూర్తిగా ఆఫ్లైన్లో జరగనున్న పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నీట్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంజులా దేవి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,445 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News May 5, 2024

HNK: ఓటుహక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

image

ఓటర్లు మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్ నుంచి అదాలత్ కూడలి వరకు ర్యాలీని నిర్వహించారు.

News May 4, 2024

ములుగు: పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏపీవో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి చిత్రా మిశ్రా పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓటు వినియోగించుకునే తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

News May 4, 2024

మహబూబాబాద్: పిడుగుపడి యువకుడు మృతి

image

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని లక్ష్మీ పురం గ్రామానికి చెందిన సుమన్ అనే యువకుడు పిడుగుపడి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. అప్పటివరకు సంతోషంగా ఉన్న యువకుడు ఒకసారిగా మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News May 4, 2024

WGL: వృద్ధులు 14,339.. దివ్యాంగులు 30,162

image

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో రెండో రోజు హోం ఓటింగ్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటింగ్లో పాల్గొంటున్నారు. వరంగల్ లోక్ సభ పరిధిలో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 14,339 మంది ఉండగా..దివ్యాంగులు 30,162 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.

News May 4, 2024

జనగామ: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామశివారులో గుర్తుతెలియని మృతదేహం దొరికింది. దీకొండ రాజు పొలం వద్ద 50 సంవత్సరాల మధ్య ఉండే గుర్తుతెలియని పురుషుని మృతదేహం లభ్యమయింది. మృతుడిపై బ్లాక్ కలర్ ప్యాంటు, నలుపు గీతల చొక్కా వుంది. డెడ్‌బాడీ పూర్తి ఎండిపోయి బిగిసుకుపోయినట్టు ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 4, 2024

కొత్తగూడ: వడదెబ్బతో మృతి

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన ఆవుల కనకయ్య(59) వడదెబ్బతో మృతి చెందాడు.3రోజులుగా ఎండ తీవ్రతతో కనకయ్య అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.

News May 4, 2024

WGL: బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన రాపోలు ఆనందభాస్కర్

image

మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ శనివారం బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని పోస్ట్ ద్వారా పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. తన అవసరం బీఆర్ఎస్‌కు లేకనే గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తాను భవిష్యత్‌లో ప్రజా ఉద్యమంలో ఉంటానన్నారు. తన చేనేత కార్మికుల ఉపాధి సమస్యల కోసం పోరాడుతానన్నారు.