India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిబంధనలకు అనుగుణంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్, సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ యానిమల్స్ నిబంధనలకు అనుగుణంగా, ఆర్టికల్-48 ప్రకారం పశుజాతుల రక్షణ, జంతువుల వధించుట నిషేధమన్నారు. ముస్లిం సోదరులందరూ శాంతి యుతంగా, ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులుగా తాము పరస్పర అవగాహనతో కలిసి సాగుతున్నామని మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్పష్టం చేశారు. తమ మధ్య విభేదాలున్నాయంటూ ఓ న్యూస్ ఛానల్ లోనూ, దినపత్రికలోనూ వచ్చిన తప్పుడు కథనాలపై మంత్రులు ఇరువురు స్పందించారు. అవి నిరాధారమైన ఆరోపణలంటూ కొట్టిపారేశారు. కొన్ని వ్యతిరేక శక్తులు కావాలని తమపై బురదజల్లే చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. జీఆర్పీ పోలీసుల ప్రకారం.. భద్రాద్రి జిల్లాకు చెందిన సందీప్(25) HYDలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత పనిపై సొంతూరుకు వచ్చిన అతడు స్నేహితుడితో కలిసి తిగురుపయనమయ్యాడు. MHBD నుంచి SCB షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తుండగా.. నెక్కొండ-ఎలుగూరు రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
ఉమ్మడి WGL వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువ పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా ఏడాదికి రూ.320 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. పెంచితే ఏడాదికి రూ.500 కోట్లకు పైగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ప్రశాంత్‌నగర్ కాలనీలో బయటి మార్కెట్ ప్రకారం గజానికి రూ.40నుంచి రూ.50వేల వరకు పలుకుతోంది. మార్కెట్ విలువ రూ.9వేలు ఉంది. ఇలాంటి చోట్ల 40-50శాతం ఛార్జీలు పెంచే అవకాశముంది.
వరంగల్ జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కలెక్టర్ ప్రావీణ్య శ్రీకారం చుట్టారు. పలు మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలను గుర్తించి వాటి అభివృద్ధి కోసం సుమారు రూ.22.19 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో వరంగల్ కేంద్రీయ గ్రంథాలయం, పర్వతగిరి, కరీమాబాద్, రంగశాయిపేట, ఉర్సు, నర్సంపేట, ఖానాపూరం, నెక్కొండ, చెన్నారావుపేట, దుగ్గొండి గ్రంధాలయాలు మరమ్మతుకు నోచుకోనున్నాయి.
పాత కాలంనాటి కచ్చా నాలాలతోనే ముంపు సమస్య ఉందని, వరదనీటి కాలువల నిర్మాణమే శాశ్వత పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం హన్మకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయంలో రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మేయర్, ఎంపీ, ఎమ్మెల్యేలు అన్ని ప్రభుత్వ శాఖలతో సమీక్ష సమావేశం జరగనుంది. వరద ముంపు, మొక్కల పెంపకం, 66 డివిజన్లలో అభివృద్ది పనులు తదితర అంశాలపై చర్చించనున్నారు.
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. సర్కార్ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య, సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. వరంగల్ జిల్లాలో 724 పాఠశాలలు ఉండగా.. మొదటి విడతలో 645 పాఠశాలను ఎంపికచేసి రూ.24.09 నిధులు కేటాయించారు.
ఏపీలోని పిఠాపురం సంస్కృతి తెలంగాణకు చేరింది. ఇటీవల KNR జిల్లా చొప్పదండి, WGL పాలకుర్తి MLAల అభిమానులు వాహనాల మీద ‘ఎమ్మెల్యేల గారి తాలూకా’ అనే స్టిక్కర్లు అతికించి సందడి చేసిన విషయం తెలిసిందే. దీన్ని అనుసరిస్తూ డోర్నకల్‌లో సైతం వాహనాల మీద ఈ తరహా స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. మంగళవారం డోర్నకల్ మండలంలో ఓ వాహనంపై ‘డోర్నకల్ MLA గారి తాలూకా’ అని రాసి ఉన్న స్టిక్కరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలనలో మహిళల మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలోనూ వరంగల్ ప్రాంతాన్ని రాణిరుద్రమదేవి పరిపాలించింది. రాణిరుద్రమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకునట్లుగా జిల్లాలో 80శాతం ప్రజాప్రతినిధులు, అధికార సారథులు మహిళలే కావడం విశేషం. జిల్లా నుండి ఇద్దరు మహిళా మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఐదుగురు జడ్పీ చైర్మన్లు, మేయర్, మెజార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మహిళలే ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు బంద్ ఉండనుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని అధికారులు సూచించారు. గురువారం మార్కెట్ యథాతథంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.