India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సీతక్కతో కలిసి సీఎంను కలిసి పూలబొకే అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ప్రజా పాలనలో భాగంగా మంత్రి సీతక్క రాష్ట్ర సచివాలయంలో వరదలకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ముందస్తుగా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొత్త కనెక్షన్, పాత కనెక్షన్‌పై సమీక్షించారు. పాత గృహాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడు నర్సంపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా పట్టణంలో నిర్మాణంలో ఉన్న నర్సంపేట వైద్యకళాశాల భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మ్యాపును పరిశీలించి, అధికారులకు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. నిర్మాణంలో అలసత్వం వహించవద్దని, నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి గుండెపోటుతో భక్తుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన వినయ్ కుమార్.. రాజన్న దర్శనం చేసుకున్నాడు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికుల సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ మృతి చెందాడు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నేడు మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.18,500 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి సైతం నిన్నటి (రూ.16,500) ధర వచ్చింది. వండర్ హాట్ (WH) రకం మిర్చికి సోమవారం రూ.18,000 ధర రాగా నేడు రూ.18,500 ధర వచ్చింది. కాగా, నేడు మార్కెట్‌కు మిర్చి తరలివచ్చింది.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని డీఈ విజయ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తపేట సబ్ స్టేషన్లో విద్యుత్ అధికారులతో డీఈ సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
చింతచెట్టు కోసం జరిగిన గొడవ కొడుకు చేతిలో తల్లి ప్రాణాలు పోవడానికి కారణమైంది. HNK జిల్లా శాయంపేట మం. కొప్పులకు చెందిన తిరుపతి రెడ్డికి, జయపాల్ రెడ్డికి ఈనెల 8న చింతచెట్టు విషయంలో గొడవ జరిగింది. గొడవ వద్దని తిరుపతిరెడ్డిని భార్య అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కోపంలో భార్యను కొట్టేందుకు తిరుపతిరెడ్డి ప్రయత్నించగా.. తల్లి నర్సమ్మ అడ్డుకుంది. దీంతో తీవ్ర గాయాలపాలై MGMకు తీసుకెళ్లే క్రమంలో మరణించింది.
మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మక్క-సారలమ్మల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిపేలా గద్దెల వెనకవైపు ఉన్న 25 ఎకరాల్లో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది. జాతర విశేషాలతో పాటు.. అప్పటి వస్తువులు, వారి గొప్పతనం తెలిపేలా మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్ట సుందరీకరణతో పాటు భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. నిన్న క్వింటా పత్తి రూ.7,025 ధర పలకగా నేడు రూ.25 తగ్గి రూ.7వేలకి పడిపోయింది. పత్తి ధర మళ్లీ తగ్గడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గార్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ బజార్‌కి చెందిన 15 నెలల చిన్నారి షబానా క్యాన్సర్ వ్యాధితో మృతిచెందింది. పుట్టిన కొద్దిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి.. సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Sorry, no posts matched your criteria.