Warangal

News May 1, 2024

SSC ఫలితాలలో తేజస్వి విజయదుందుభి

image

SSC-2024 ఫలితాలలో హనుమకొండలోని తేజస్వి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో తమ విజయ పరంపర కొనసాగించారు. 104 మంది 10 GPA సాధించారు. వీరితో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు మరెన్నో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్స్‌తో సత్తా చాటారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన బోధన, బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది.

News May 1, 2024

వరంగల్ తూర్పులో BRS పార్టీకి ఎదురుదెబ్బ..!

image

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో BRSకి మరో ఎదురు దెబ్బ తగలనుంది. గ్రేటర్ వరంగల్ 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన-నవీన్ తమ సొంత గూటికి చేరుతున్నారని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఎట్టకేలకు వారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బీజేపీలో పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలతో చేరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో BRS పార్టీకి షాక్ తగలనుంది.

News May 1, 2024

నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్ బంద్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు బంద్ ఉండనుంది. కార్మికుల దినోత్సవం మే డే, అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కోన్నారు. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్ కి సరుకులు తీసుకొని రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

News May 1, 2024

WGL: జూన్ 3 నుంచి 10వ తరగతి సప్లమెంటరీ పరీక్షలు: డీఈఓ

image

వరంగల్ జిల్లాలో పదోతరగతిలో 92.20% ఉత్తీర్ణత శాతాన్ని సాధించి రాష్ట్రస్థాయిలో 22వ స్థానాన్ని సాధించామని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి తెలిపారు. వార్షిక పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్ధులకు సప్లమెంటరీ పరీక్షలు జూన్ 03 నుంచి 13 వరకు ఉంటాయన్నారు. ఈ పరీక్షలకు ఫీజు చివరి తేది మే 16 అని కావున సంబందిత ప్రదానోపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయం తెలపాలని ఆదేశించారు.

News April 30, 2024

ములుగు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. తాడ్వాయి పసర జాతీయ రహదారి 163పై మంగళవారం రాత్రి అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలో బైకును గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటాపురం మండలానికి చెందిన జ్యోతి కిరణ్, వెంకటేశ్ మృతి చెందగా.. వాజేడు మండలానికి చెందిన రక్షిత్‌కు తీవ్రగాయాలయ్యాయి. కాగా, వీరు ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News April 30, 2024

రైలు కిందపడి సివిల్ ఇంజినీర్ ఆత్మహత్య

image

వరంగల్-కాజీపేట రైల్వేస్టేషన్ల మధ్య శాయంపేట రైల్వేగేటు సమీపంలో మంగళవారం ఉ.9గంటలకు రైలు కిందపడి NIT సివిల్ ఇంజనీర్ హిమాన్షుగుప్తా (33) ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవకారణంగా తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లోంచి బయటకు వచ్చిన హిమాన్ష్‌గుప్తా ఆత్మహత్యకు పాల్పడినట్లు వరంగల్ రైల్వేపోలీసులు తెలిపారు. మృతుడు కాజీపేట ప్రశాంతనగర్ వాసి కాగా.. మృతుడి మిస్సింగ్‌పై ఉదయం కాజీపేటలో భార్యఫిర్యాదు చేశారు.

News April 30, 2024

ములుగు: పదోతరగతి ఫలితాల్లో 10/10 సాధించిన విద్యార్థి

image

పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన బిందు సాయిలత అనే విద్యార్థి 10/10 జీపీఏ సాధించింది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించినందుకు పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని అభినందించారు.

News April 30, 2024

10th Result: నాలుగో స్థానంలో జనగామ

image

పదోతరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో జనగామ 98.16 శాతంతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. హనుమకొండ 95.99 శాతంతో పదో స్థానం, మహబూబాబాద్ 94.62 శాతంతో 12వ స్థానం, ములుగు 94.45 శాతంతో 13వ స్థానం, భూపాలపల్లి 92.96 శాతంతో 16వ స్థానం, వరంగల్ 92.20 శాతంతో 22వ స్థానంలో నిలిచింది.

News April 30, 2024

వరంగల్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. జల్లి గ్రామానికి చెందిన సొసైటీ మాజీ వైస్ ఛైర్మన్ చెన్నారెడ్డి, ఆయన తల్లి విజయ మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అమీనాబాద్ శివారులో బైక్‌కు కుక్క అడ్డురావడంతో కింద పడ్డారు. ప్రమాదంలో విజయ అక్కడికక్కడే మృతి చెందగా, చెన్నారెడ్డికి గాయాలయ్యాయి.

News April 30, 2024

10th Result: వరంగల్‌లో 44,397 మంది వెయిటింగ్

image

నేడు పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. వరంగల్ జిల్లాలో 9,537 మంది, హనుమకొండలో 12,346 మంది, జనగామలో 6,698 మంది, భూపాలపల్లిలో 3,547 మంది, ములుగులో 3,088 మంది, మహబూబాబాద్‌లో 9,181 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.