India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కష్టపడి పని చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఆశించిన రీతిలో రాలేదని, రాకేష్ రెడ్డి నిత్యం బలంగా, సానుకూలంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేటీఆర్ అన్నారు.
జూన్ 9వ తేదీన (రేపు) జరుగనున్న గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ పరీక్షలకు 3,697మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. 14కేంద్రాలలో జూన్ 9వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అకాల మృతిపై పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించారన్నారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడని ఆమె కొనియాడారు.
పట్టభద్రుల MLC ఉపఎన్నిక లెక్కింపు 60 గంటలకు పైగా సాగింది. కౌంటింగ్‌లో మొత్తం 52మంది అభ్యర్థులు, 3వేల మందికి పైగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 12 గంటల పాటూ ఏకధాటిగా విధుల్లో ఉండడంతో అలసిపోయారు. గోదాముల్లో కూలర్లు ఏర్పాటు చేసినా అక్కడి ఉక్కపోతతో కొంతమంది డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. గతంలో 56 టేబుళ్లపై లెక్కించగా.. ఈదఫా 96టేబుళ్లపై ఓట్లను లెక్కించినా ప్రక్రియ ఆలస్యమవడంతో అవస్థలు పడినట్లు తెలిపారు.
తెలంగాణ అధికారిక రాజముద్రపై తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాజముద్రలో కీర్తి తోరణం తొలగించలేదని, అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని, కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
WGL-KMM-NLG BRS ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఓటమిపై స్పందించారు. ఓటమిని అంగీకరించినట్లు ప్రకటించారు. సాంకేతికంగా ఓడిపోవచ్చు.. కానీ, నైతికంగా గెలిచానని అన్నారు. పన్నెండేళ్లుగా ప్రజల కోసం పని చేస్తున్నానని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులందరూ తనకు ఎంతో సపోర్ట్ చేశారన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పట్టభద్రుల కొరకు ప్రజా క్షేత్రంలో పోరాడుతానని పేర్కొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. తిరిగి సోమవారం మార్కెట్ ఓపెన్ కానుంది.
భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సందర్శించారు. బ్యారేజీలో కుంగిన పిల్లర్లను ఎమ్మెల్యే పరిశీలించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్ రెడ్డి, కొమురయ్య, తక్కల్లపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.
జనగామ జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 11న జిల్లాలోని నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి తెలిపారు. ఎస్ బ్యాంక్‌లో 50 సీనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీ ఉంటుంది అన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతల జిరాక్స్‌లతో కలెక్టర్ కార్యాలయానికి రావాలన్నారు.
WGL-KMM-NLG గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా, ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,712 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,709 ఓట్లు, రాకేష్ రెడ్డి(BRS)కి 1,04,846 ఓట్లు రాగా.. మొత్తంగా మల్లన్న 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో గెలుపు ఎవరిదో తెలియనుంది.
Sorry, no posts matched your criteria.