Warangal

News June 7, 2024

WGL: MLC ఎన్నిక.. ఆధిక్యంలో మల్లన్న

image

WGL-KMM-NLG గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. కాగా, ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,712 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,709 ఓట్లు, రాకేష్ రెడ్డి(BRS)కి 1,04,846 ఓట్లు రాగా.. మొత్తంగా మల్లన్న 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో గెలుపు ఎవరిదో తెలియనుంది.

News June 7, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీతక్క

image

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరదల వల్ల ప్రాన నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. గత ఏడాది వరదల కారణంగా ముంపుకు గురైన గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.

News June 7, 2024

KMM-NLG-WGL: ఎమ్మెల్సీ ఎన్నిక.. 40 మంది ఎలిమినేషన్

image

నల్గొండ పట్టణ పరిధిలోని దుప్పలపల్లి FCI గోదాంలో KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం రాత్రి నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించగా ఇప్పటి వరకు 40 మందిని ఎలిమినేషన్ చేశారు. బీజేపీ అభ్యర్థి ప్రేమ్ చందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ ఎలిమినేషన్ తర్వాతనే ఫలితం తేలనుంది.

News June 7, 2024

NLG-KMM-WGL: 33 మంది ఎలిమినేషన్

image

NLG-KMM-WGL ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,696 ఆధిక్యంలో ఉన్నారు. గెలుపునకు కావాల్సిన కోటా ఓట్లు 1,55,095 అవసరం ఉండగా మల్లన్నకు గెలుపునకు ఇంకా 31,885 ఓట్లు రావాలి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 50,581 ఓట్లు కావాలి.

News June 7, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పలు రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.18 వేల ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి రూ.17 వేల ధర, వండర్ హాట్ (WH) రకం మిర్చికి రూ.18,100 ధర వచ్చింది. మరో వైపు 5,531 రకం మిర్చి రూ.13,500 పలికింది. మార్కెట్‌లో  క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. 

News June 7, 2024

ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఎంతంటే?

image

ఆరు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పున: ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. నేడు క్వింటా పత్తి ధర రూ.7,005 పలికింది. కాలం మారినా ధరలు మాత్రం పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.

News June 7, 2024

KMM-NLG-WGL: 26 మంది ఎలిమినేట్‌

image

KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 26 మంది ఎలిమినేట్‌ అయ్యారు.27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎలిమినేషన్‌ రౌండ్స్‌లో కాంగ్రెస్‌‌కు 220 ఓట్లు రాగా, BRSకు 139 ఓట్లు, BJPకి 118 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 76 ఓట్లు పోలయ్యాయి. మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 7, 2024

KMM-NLG-WGL: గెలుపు కోసం 1,55,095 ఓట్లు..!

image

రెండు రోజులుగా కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. KMM-NLG-WGL ఉపఎన్నిక కౌంటింగ్‌లో ఎవరికి గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు రావాల్సి ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,22,813 ఓట్లు, BRS అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,246 ఓట్లు, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.

News June 7, 2024

మహబూబాబాద్: వివాహం చేసుకున్న ఇద్దరు మహిళలు!

image

MHBD జిల్లా కొత్తగూడ మండలంలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వివాహిత మహిళలు గ్రామం నుంచి ఇటీవల పారిపోయారు. వారు వివాహం చేసుకుని భద్రాద్రి జిల్లా గుండాల(M) లోని ఓ గ్రామంలో రహస్యంగా జీవించారు. వీరిలో ఒక వివాహిత ప్యాంటు, షర్టు ధరిస్తూ పురుషుడిలా నమ్మించేది. వీరి కోసం వారి బంధువులు గాలించి చివరకు గుండాల వద్ద బుధవారం పట్టుకుని గురువారం గ్రామానికి తీసుకొచ్చారు. స్థానిక మహిళలు దేహశుద్ధి చేసినట్లు సమాచారం.

News June 7, 2024

కేయూ: 8 నుంచి దూరవిద్య ప్రాక్టికల్ పరీక్షలు

image

కేయూ దూరవిద్య పీజీ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 8 నుంచి ప్రారంభిస్తున్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ రామచంద్రన్ ప్రకటనలో తెలిపారు. 8న బోటనీ, 9న ఫిజిక్స్, 12న జువాలజీ, కెమిస్ట్రీ, 13న కెమిస్ట్రీ మరో పేపర్ ఉంటాయని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.