India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 3,36,013 పోలవగా అందులో చెల్లని ఓట్లు 25,854 ఉండటం విశేషం. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీపడగా చెల్లని ఓట్ల సంఖ్య 5వ స్థానంలో నిలిచింది. డిగ్రీలు చదివిన ఓటర్లు ఇలా ఓటును దుర్వినియోగం చేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.
టీజీ ఐసెట్ ప్రశాంతంగా జరిగినట్టు ఐసెట్ కన్వీనర్ నరసింహాచారి తెలిపారు. గురువారం ఉదయం జరిగిన మూడో సెషన్‌లో 28,256 మంది విద్యార్థులకు గాను 25,662 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. ఈ నెల 5 ,6న మూడు సెషన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 116 రీజియన్ సెంటర్లలో 86,156 మంది విద్యార్థులకు గాను 77,942 (90.47%) మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం రాజకీయ ప్రముఖులకు పుట్టినిల్లుగా నిలుస్తోంది. స్టేషన్ ఘనపూర్ MLA, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, BJP రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పుట్టింది పర్వతగిరి గ్రామమే. కడియం శ్రీహరి కూతురు కావ్య సైతం ఇక్కడే జన్మించారు. ఇప్పుడు వరంగల్ MPగా గెలుపొందడంతో పర్వతగిరి ఊరు పేరు మరోసారి మారుమోగుతోంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు పునఃప్రారంభం కానుంది. జూన్ 1, 2 సాధారణ సెలవులు, 3, 4, 5వ తేదీల్లో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ను పురస్కరించుకుని ఎన్నికల అధికారులు, కలెక్టర్ల ఆదేశాలమేరకు, 6న అమావాస్య సందర్బంగా మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. తిరిగి శుక్రవారం మార్కెట్ పునఃప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
బుధవారం కాజీపేటలో మహిళ <<13387500>>హత్యకు <<>>గురైన విషయం తెలిసిందే. మృతదేహం పక్కన ఉన్న ఆధారాలను బట్టి మహిళ దర్గాకాజీపేటలోని లావుడ్యా తండాకు చెందిన లావుడ్యా కుమార్ భార్య యామిని ఆలియాస్ కుమారి(33)గా పోలీసులు గుర్తించారు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఇక్కడకు ఎందుకు వచ్చిందో.. ఎవరు హత్య చేశారు అనే వివరాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని MGMకి తరలించారు.
నల్గొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి MLC కౌంటింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్ తేలుకాటుకు గురైంది. మీడియా సెంటర్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆమెను బుధవారం రాత్రి తేలుకాటు వేసింది. అక్కడున్న సిబ్బంది 108 వాహనంలో చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల MLC ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో తీన్మార్ మల్లన్నకు 36,210, బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్‌కు 9109 ఓట్లు వచ్చాయి.
వరద నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమీషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ఖచ్చితమైన అవగాహన ఉండాలని అన్నారు. నీరు సాఫీగా వెళ్లడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు.
HNK జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాజీపేట మం.లో యువతి దారుణహత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల శివారులోని అమ్మవారిపేటలోని సాయినాథ్ రియల్ ఎస్టేట్ వెంచర్(భట్టుపల్లి నుంచి ఉర్సుగుట్ట వెళ్లే దారి)లో సుమారు 30ఏళ్ల యువతి హత్యకు గురైంది. యువతి ముఖంపై బండరాళ్లతో కొట్టి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్‌లో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు భూపరీక్షలు ప్రారంభించారు. బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మట్టి, మెటీరియల్ నమూనాలను సేకరిస్తున్నారు. బ్యారేజ్ కుంగిన పిల్లర్ల వద్ద 25 ఫీట్ల మేర డ్రిల్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షలను నిపుణులు పర్యవేక్షిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.