Warangal

News April 25, 2024

WGL: కాంగ్రెస్‌లోకి గుండు సుధారాణి

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో గుండు సుధారాణికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత నెల రోజులుగా గుండు సుధారాణి బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఊహాగానాలు వినిపించాయి. గురువారం పార్టీ మారడంతో ఊహాగానాలు నిజమయ్యాయి.

News April 25, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన పత్తి ధర

image

నిన్న ప్రత్యేక సెలవు (ఎండాకాలం నేపథ్యంలో ప్రతీ బుధవారం సెలవు) అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభం అయింది. అయితే మొన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర తగ్గింది. మొన్న రూ.7,100 పలికిన క్వింటా పత్తి.. ఈరోజు రూ.7020 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News April 25, 2024

నర్సంపేట: ఆసుపత్రి బోర్డుపై తప్పులు!

image

నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి బోర్డుపై తప్పులు దొర్లడంతో స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. నర్సంపేటకు మంజూరైన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాలను తాత్కాలికంగా పాత ఆసుపత్రిలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆసుపత్రి గేటు ముందు బోర్డును ఏర్పాటు చేసి.. తెలుగు, ఇంగ్లిష్‌లలో పేర్లు రాశారు. ఇంగ్లిష్‌లో పలు తప్పులు దొర్లాయి. మరి సరి చేస్తారో లేదో చూడాలి.

News April 25, 2024

ఉమ్మడి జిల్లాలో వరంగల్ లాస్ట్

image

ఇంటర్ ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనకబడింది. ఫస్టియర్ ఫలితాల్లో 24వ స్థానం సాధించగా.. సెకండియర్ ఫలితాల్లో 26వ స్థానంలో నిలిచింది. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా 82.95 శాతంతో తొలి స్థానంలో, ఫస్టియర్ ఫలితాల్లో 70.01శాతంతో 3వ స్థానంలో నిలిచింది. కాగా, WGL 2021-22లో రాష్ట్రంలో ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో 25వ స్థానంలో నిలవగా.. 2022-23లో ఫస్టియర్‌లో 27వ స్థానం, సెకండియర్ ఫలితాల్లో 33వ స్థానంలో నిలిచింది.

News April 25, 2024

WGL: పరీక్షల్లో ఫెయిల్.. ఇద్దరు విద్యార్థులు బలవన్మరణం

image

పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనే మనస్తాపంతో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా రెడ్యాలకు చెందిన యశస్విని ఫస్టియర్‌ ఎకనామిక్స్ ఫెయిల్ కావడంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా, డోర్నకల్ మండలానికి చెందిన భార్గవి ఫస్టియర్ బోటనీలో ఫెయిల్ కావడంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

News April 25, 2024

HNK: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా!

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రాష్ట్రంలో HNK జిల్లా 6వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 18,533 మంది పరీక్ష రాయగా.. 11,578 మంది పాసయ్యారు. ఈ క్రమంలోనే HNKకు చెందిన తొగర సాత్విక MPCలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించారు. దీంతో అందరి అభినందనలు పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 8,905 మంది బాలికలకు గానూ 6,224 మంది పాసయ్యారు. బాలికలు 69.79 శాతం, బాలురు 55.49 శాతం ఉత్తీర్ణత సాధించారు.

News April 25, 2024

ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సాధారణ సెలవుల అనంతరం నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. కావున ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్‌కు తరలించే సమయంలో పలు సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే మంచి ధర పలుకుతుందని అధికారులు తెలిపారు.

News April 25, 2024

వరంగల్ పార్లమెంటరీ స్థానానికి 19 మంది నామినేషన్ దాఖలు

image

వరంగల్ ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పి. ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 21 సెట్లు నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ అన్నారు. నామినేషన్ స్క్రూటీని భారత ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 26 వరకు ఉంటాయన్నారు. ఏప్రిల్ 29 న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు.

News April 25, 2024

పట్టభద్రుల ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న

image

ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించారు. ఏఐసీసీ జాతీయ కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఈ మేరకు బుధవారం ప్రకటించారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

News April 25, 2024

‘ఎన్నికల సంబంధిత సమస్యలుంటే కాల్ చేయండి’

image

వరంగల్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల సాధారణ పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణవీర్ చంద్, ఐఏఎస్ మొబైల్ నం. 8247524267కు, ఎన్నికల పోలీసు పరిశీలకులు నవీన్ సాయిని, ఐపీఎస్ మొబైల్ నం. 9855127500కు ఫిర్యాదులు చేయవచ్చన్నారు.