Warangal

News April 25, 2024

ములుగు జిల్లా టాప్

image

ఇంటర్ సెకండీయర్ ఫలితాల్లో రాష్ట్రంలో ములుగు ప్రథమ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లా 82.95 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ములుగు జిల్లా వ్యాప్తంగా 1,695 మంది పరీక్ష రాయగా.. 1,406 మంది పాసయ్యారు. 928 మంది బాలురకు గాను 729 మంది(78.56 శాతం) పాసవ్వగా.. 767 మంది బాలికలకు గానూ 677 మంది(88.27శాతం)తో పాసయ్యారు.

News April 25, 2024

ఉమ్మడి WGL జిల్లాలో 77వేల మంది ఇంటర్ విద్యార్థులు

image

నేడు వెలువడనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల ఫలితాల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 77వేల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో 38,780 మంది, ద్వితీయ సంవత్సరంలో 39,184 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. కొందరు గైర్హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 134 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి.

News April 25, 2024

నేడు వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

నేడు వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మడికొండలో జరిగే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో 3గంటలకు పాల్గొనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ప్రచారంలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

News April 25, 2024

జనగామ: పెళ్లైన మరుసటి రోజు రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి

image

జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ‘స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన స్వాతికి ఆదివారం వివాహం జరిగింది. సోమవారం వేములవాడకు వెళ్తున్న క్రమంలో కరీంనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తలకి బలమైన గాయం కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 25, 2024

కడియం శ్రీహరి పార్టీ మార్పుపై స్పందించిన KCR

image

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మార్పుపై మాజీ సీఎం KCR తొలిసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కడియం శ్రీహరి వెళ్లడం వల్ల మాకు లాభం జరిగిందని, వరంగల్‌లో కడియం శ్రీహరి చచ్చి, బీఆర్ఎస్ పార్టీని బతికించాడని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూడండి.. ఫలితాలు కనిపిస్తాయని అన్నారు.

News April 25, 2024

నేడు వరంగల్ ఎంపీ స్థానానికి ఏడుగురు నామినేషన్లు దాఖలు

image

15 ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి మొత్తం మంగళవారం ఏడుగురు నామినేషన్ వేశారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మొత్తం 9 సెట్ల నామినేషన్ దాఖలు అయ్యాయని అన్నారు. వీరిలో పోగుల అశోక్ (IND) ఒక సెట్ నామినేషన్, మచ్చ దేవేందర్ (VCKP) 2 సెట్ల నామినేషన్, కుమ్మరి కన్నయ్య (IND) ఒక సెట్ నామినేషన్, కొంగర అనిల్ కుమార్ (IND) ఒక సెట్ నామినేషన్, చిలుముళ్ళ సుజాత (IND) ఒక సెట్ నామినేషన్ వేసారన్నారు.

News April 25, 2024

టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ వేసవి శిక్షణ కోర్సులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని హనుమకొండ డిఈఓ అబ్దుల్ హై ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను తేదీ 24.04.2024 నుంచి 30.04.2024 వరకు స్వీకరిస్తామన్నారు. దరఖాస్తు చేయువారు 22.04.2024 నాటికి 18 సంవత్సరాలు నుండి 45 సంవత్సరముల లోపు ఉండి టెన్త్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

News April 25, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం తేజ మిర్చి క్వింటా రూ.17,800 ధర పలకగా.. 341 రకం మిర్చి రూ.14,000 పలికింది. అలాగే వండర్ హాట్(WH) రకం మిర్చి రూ.14,000 పలికింది. దీపిక మిర్చి రూ.15వేలు, 5531 రకం మిర్చి రూ.11,500 ధర, టమాటా మిర్చికి 24వేల ధర వచ్చింది. పసుపు కాడి క్వింటాకి రూ.14,155, పసుపు గోల రూ.13723, మక్కలు బిల్టీ రూ.2265 ధర పలికాయి.

News April 24, 2024

ఖానాపురం: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

ఖానాపురం మండలం బుధారావుపేట గ్రామంలో జాతీయ రహదారి పై మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నర్సంపేట నుంచి బుధరావుపేటకి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో‌ను వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న సులేమాన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురు మహిళలకి గాయాలు అయ్యాయి. కారు డ్రైవరు అక్కడి నుంచి పరారు అయ్యారు. పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

News April 24, 2024

ములుగు జిల్లాలో వడదెబ్బతో వ్యక్తి మృతి

image

వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు మండలం మహ్మద్‌గౌస్‌పల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చింతల రాజు (35) మతిస్థిమితం కోల్పోయి పంచోతుకులపల్లికి నడుకుంటూ వెళ్లి వడ దెబ్బతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.