Warangal

News April 21, 2024

MHBD: ‘అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఉంటే బ్రతికి ఉండేవాడు’ 

image

చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన జక్కుల హరీశ్(28), అతని కొడుకు ఆశ్విత్ తేజ్(5)లు నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో <<13091376>>మృతి<<>>చెందిన విషయం తెలిసిందే. ఐతే ఆశ్విత్ తేజ్ రోజు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళే వాడు. నిన్న తండ్రితో పాటు పెళ్లి వేడుకకు వెళ్లకుండా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఉంటే బ్రతికి ఉండేవాడని ఆశ్విత్ తేజ్ మృతదేహాన్ని చూసి అంగన్వాడీ టీచర్లు కన్నీటి పర్యంతం అయ్యారు.

News April 21, 2024

వరంగల్: రెండు బైక్‌‌లు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

image

డోర్నకల్ మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంలో 108 వాహనంలో ఏరియా హాస్పిటల్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2024

వెంకటాపురం: పెళ్లి జరిగిన 17 రోజులకే సూసైడ్

image

నవ వధువు సూసైడ్ చేసుకున్న ఘటన వెంకటాపురం మండలంలోని ముత్తారంలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శశికళకు భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి చెందిన వినోద్‌తో ఈనెల 4న వివహం జరిగింది. అత్తవారి ఇంటి నుంచి నాలుగు రోజులు కిందటే పుట్టింటికి వచ్చింది. శనివారం మెట్టినింటికి వెళ్లేందుకు ఆమె అయిష్టత చూపడంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెంది ఇంట్లోని పురుగు మందు తాగింది.

News April 21, 2024

వరంగల్: ఎరుపెక్కిన ఎనుమాముల మార్కెట్

image

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నాయి. కొనుగోళ్లు జరిపినప్పుడు బస్తాల నుంచి మిర్చి గింజలు పడడంతో శనివారం కురిసిన భారీ వర్షానికి మార్కెట్‌లోని మిర్చి కొనుగోలు పరిసరాలు ఇలా ఎర్రటి తివాచీలా.. కనువిందు చేస్తోంది. మార్కెట్‌కు ఎర్రటి సింధూరం పెట్టినట్లుగా మార్కెట్ మొత్తం ఎరుపు మయం అయింది.

News April 21, 2024

జనగామ: తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు

image

తండ్రిపై దాడిచేసిన కొడుకుపై హత్యాయత్నం నర్మెట్ట SI కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని మాన్ సింగ్ తండాకు చెందిన హరిచంద్రు కుమారుడు బిక్షపతి మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి మద్యం తాగి భార్యతో గొడవ పడుతుండగా తండ్రి అడ్డుపడ్డాడు. దీంతో కుమారుడు హరిచంద్రు భుజంపై కత్తితో దాడి చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు SI తెలిపాడు.

News April 21, 2024

WGL: పెట్రోల్ పోసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం

image

WGLలోని సత్యసాయి నగర్‌లో మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అస్మ, మజార్‌ ఫిబ్రవరిలో రెండో వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.  ఈక్రమంలో మనస్తాపానికి గురై అస్మ శనివారం సాయంత్రం ఇంట్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. మజార్‌ పెట్రోల్ పోసి నిప్పంటించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం MGMలో చికిత్స పొందుతోంది.

News April 21, 2024

కాజీపేట జంక్షన్ మీదుగా దానాపూర్‌కు ప్రత్యేక రైలు

image

వేసవి రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్- దానాపూర్‌ మధ్య కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నారు. 07021/22 నంబర్‌తో సికింద్రాబాద్-దానాపూర్‌ మధ్య ఏప్రిల్ 25, మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27 తేదీలలో ప్రతి గురువారం ఉదయం 8:30 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. అలాగే దానాపూర్ సికింద్రాబాద్‌ల మధ్య ఈ రైలు ఏప్రిల్ 21, 28, మే 5, 12, 19, 23, 30, జూన్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ఆదివారం ఈ రైలు ఉంటుంది.

News April 21, 2024

MHBD: ప్రజారోగ్య కార్యక్రమాలను నిర్వహించాలి: కళావతి బాయి

image

మహబూబాబాద్ ఐడిఓసి లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో శనివారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళావతి బాయి వైద్యారోగ్యశాఖలోని ప్రోగ్రాం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ప్రజారోగ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు.

News April 21, 2024

ఎన్నికల వ్యయ ఖర్చులను పక్కగా నమోదు చేయాలి: ఏ. దిలిబన్

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వ్యయ ఖర్చులను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఎన్నికల వ్యయ ఖర్చుల పరిశీలకులు ఏ.దిలిబన్ అధికారులకు ఆదేశించారు. శనివారం స్టేషన్‌ఘనపూర్‌లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు డబ్బు, మద్యంపై నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల వ్యయసంబధిత అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చని ప్రజలకు సూచించారు.

News April 20, 2024

స్టేషన్‌ఘనపూర్: లారీ, ఆటో ఢీ.. ఒకరు మృతి

image

స్టేషన్‌ఘనపూర్ నుంచి హనుమకొండకు వచ్చే జాతీయ రహదారిపై పెద్ద పెండ్యాల గ్రామ శివారులో శనివారం రాత్రి ఆటో, లారీ ఢీకొని ఒకరు మృతిచెందారు. పెట్రోల్ లోడుతో వెళ్తున్న హెచ్పీ కంపెనీ లారీని ప్యాసింజర్ ఆటోడ్రైవర్ ఓవర్‌టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి లారీ ఢీకొని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.