Warangal

News April 19, 2024

ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులకు సంప్రదించండి

image

వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్  ప్రావీణ్య పేర్కొన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏ.ధిలీబన్ నంబర్ 8309921306కు అదేవిధంగా వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు ధీరజ్ సింగా 8309952057కు చేయవచ్చన్నారు.

News April 19, 2024

జనగామ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జనగామ జిల్లా బచ్చన్నపేటకి చెందిన సందేల అశోక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2024

జనగామ: పరీక్షలో ఫెయిల్‌ అవుతానని ఆత్మహత్య

image

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో వంశీ అనే యువకుడు<<13076185>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. SI సాయి ప్రసన్నకుమార్ కథనం ప్రకారం.. గతేడాది ఇంటర్ పరీక్షల్లో వంశీ ఫెయిలయ్యాడు. ఇటీవల సప్లిమెంటరీ కూడా రాశాడు. అయితే మరోసారి పరీక్షలో తప్పుతానన్న భయంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం తల్లి చూడగా మృతి చెంది ఉన్నాడని SI తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు SI చెప్పారు.

News April 19, 2024

WGL: టెట్ ఉచిత శిక్షణా తరగతులు

image

టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి టెట్ ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలోని ఉమాపతి భవన్‌లో ఆ సంఘం నేతలు ఆవిష్కరించారు. ఉచిత శిక్షణ కోసం 9573141365 నంబర్‌కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News April 18, 2024

అనాధ బాలికలు దరఖాస్తుల ఆహ్వానం

image

దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళ టెక్నికల్ శిక్షణా సంస్థ HYD, పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులకు 2024-25 విద్యాసంవత్సరానికి జనగామ జిల్లాలోని అనాథ బాలికలు, పేదరికంలో ఉన్న బాలికలు పదవ తరగతి పూర్తి చేసిన బాలికలకు అర్హత పరీక్ష లేకుండా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. మే 15లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News April 18, 2024

వేసవి క్రీడా శిక్షణా శిబిరం నిర్వాహణకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహణకు ఉత్సాహవంతులైన వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకట్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9182552593 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

News April 18, 2024

విజయవాడ పార్లమెంట్ స్థానానికి జనగామ వాసి నామినేషన్

image

విజయవాడ పార్లమెంట్ స్థానానికి జనగామ వాసి నామినేషన్ వేసినట్లు ఆ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఢిల్లీ రావు తెలిపారు. తొలిరోజు 4 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా జనగామ జిల్లాకు చెందిన అర్జున్ చేవిటి రెండు నామినేషన్లు, సోషలిస్ట్ యునిటీ సెంటర్ ఆఫ్ ఇండియా(కమ్యూనిస్ట్) అభ్యర్థిగా విజయవాడ అజిత్ సింగ్ నగర్‌కు చెందిన గుజ్జుల లలిత రెండు దాఖలు చేశారన్నారు.

News April 18, 2024

మొదటి రోజు మూడు నామినేషన్లు స్వీకరణ

image

సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైనది. 15 వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి మొదటి రోజు మొత్తం 3 నామినేషన్లు దాఖలు అయ్యాయని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అలయెన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా అంబోజు బుద్దయ్య, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిగెల శివ, పిరమిడ్ పార్టీ అఫ్ ఇండియాపార్టీ అభ్యర్థినిగా తౌటపల్లి నర్మదా ఒక్కొ సెట్ చొప్పున నామినేషన్లు వేశారన్నారు.

News April 18, 2024

మార్పు, మార్పు అని ప్రజలు మోసపోయారు: ఎర్రబెల్లి

image

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, కార్యకర్తలు వాటిని తిప్పి కొట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పర్వతగిరి మండల స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మార్పు, మార్పు అని ప్రజలు మోసపోయారని, ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

News April 18, 2024

26న ఓపెన్ డిగ్రీ సప్లిమెంటరీ ఫీజు గడువు

image

డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఈ నెల 26లోగా చెల్లించాలని జనగామ అభ్యసన కేంద్రం సమన్వయకర్త శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 17 నుంచి పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఫీజు నిర్ణీత తేదీలోగా చెల్లించాలని కోరారు.