Warangal

News April 15, 2024

వరంగల్‌కు పొంచి ఉన్న ముప్పు!

image

WGL నగరానికి తాగునీటి ఎద్దడి ముప్పు పొంచి ఉందని గ్రేటర్ WGL ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఎండల నేపథ్యంలో ధర్మసాగర్ పెద్ద చెరువులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. శనివారం నాటికి చెరువులో ఉన్న 605 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు.. మరో 50-60 రోజుల వరకు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. దీనిపై గ్రేటర్ WGL పర్యవేక్షణ ఇంజినీర్ ప్రవీణ్‌చంద్ర మాట్లాడుతూ.. వచ్చే జూన్ మొదటి వారం వరకు ఢోకా లేదని అన్నారు.

News April 15, 2024

కడియంపై అనర్హత వేటు!.. స్టే.ఘలో ఉప ఎన్నిక?

image

మాజీ CM KCRను ఆదివారం రాత్రి మాజీ MLA రాజయ్య కలిశారు. ఈ సందర్భంగా కడియంపై అనర్హత వేటు ఖాయమని KCR స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక ఖాయమని, ఇందుకు BRS తరఫున రాజయ్య బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉండాలని KCR సూచించినట్లు సమాచారం. అంతేకాదు, లోక్‌సభ ఎన్నికల్లో కడియంను ఢీకొట్టేందుకు BRS వ్యూహం చేస్తోంది. ఇదివరకు కడియం, రాజయ్య ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వారిమధ్య విభేదాలు ఉండేవి.

News April 14, 2024

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉంటే ఫోన్లో సంప్రదించండి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోలులో ఏమైనా ఇబ్బందులుంటే రైతులు నేరుగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 7995050785కు సంప్రదించవచ్చని కలెక్టర్ ప్రావీణ్య కోరారు. జిల్లాలో 207ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికే 186 కేంద్రాలున్నాయన్నారు. నర్సంపేట ధాన్యం ఆలస్యంగా రావడం దృష్ట్యా మిగిలిన సెంటర్లను కూడా ప్రారంభిస్తామన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ శాతం పరిశీలించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

News April 14, 2024

సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా మంత్రులు, నేతలు

image

రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థులు, ఇంచార్జిలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఇన్చార్జులు పాల్గొన్నారు. పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కావ్య పాల్గొన్నారు.

News April 14, 2024

రాజయ్యకు స్టేషన్ ఘన్‌పూర్ బాధ్యతలు అప్పగింత!

image

స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎర్రవల్లిలో మాజీ సీఎం నివాసంలో కేసీఆర్‌ను ఆదివారం కలిశారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని రాజయ్యకు స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

News April 14, 2024

వరంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేయాలి: కేసీఆర్

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి వరంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌తో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారం నిర్వహించాలని ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌కు కేసీఆర్ సూచించారు.

News April 14, 2024

ముగిసిన పదో తరగతి ‘మూల్యాంకనం’

image

పదో తరగతి పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసినట్లు క్యాంపు అధికారి,హనుమకొండ DEO ఎండీ. అబ్దుల్ హై, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ డి.చలపతిరావు అన్నారు. వివిధ జిల్లాల నుంచి హనుమకొండకు 2.25 లక్షల సమాధాన పత్రాలు వచ్చినట్లు తెలిపారు.9 రోజుల శిబిరంలో 10 మంది పేపర్ కోడింగ్ అధికారులు, 8 మంది ACOలు, 175 ముఖ్య మూల్యాంకన అధికారులు, 875 సహాయ అధికారులు,500 ప్రత్యేక సహాయకులు పాల్గొన్నారని అన్నారు.

News April 14, 2024

రేపు వరంగల్ మార్కెట్ పునఃప్రారంభం

image

4 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ సోమవారం పున:ప్రారంభం కానుంది. గురువారం, శుక్రవారం రంజాన్ సెలవులు, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.

News April 14, 2024

వరంగల్: రేపు గడువు చివరి తేదీ

image

ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.

News April 14, 2024

వరంగల్: చోరీ చేసిన చర్చి పాస్టర్

image

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పరావుపేటలో ఈ నెల 11న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. సీఐ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. అలంఖానిపేటకు చెందిన దంతాల రవి అప్పలరావుపేటలో చర్చి పాస్టర్‌గా పని చేస్తున్నాడు. రోజూ చర్చికి వెళ్లే వీరభద్రరావుకు రవికి పరిచయం ఏర్పడింది. దీంతో రవి.. వీరభద్రరావు ఇంట్లో లేని సమయంలో 6 తులాల బంగారం, రూ.60,200 చోరీ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.