Warangal

News April 13, 2024

వరంగల్: ముగ్గురివి బీఆర్ఎస్ మూలాలే!

image

వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్ మూలాలు ఉన్న వారే. 2001 నుంచి బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న మారేపల్లి సుధీర్ కుమార్‌ను అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గతంలో బీఆర్ఎస్‌లో పనిచేశారు. ఆ పార్టీ నుంచి టికెట్ కూడా దక్కింది. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

News April 13, 2024

ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు సీతారాముల తలంబ్రాలు

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు (ఇంటింటికీ) అందిస్తున్నామని జనగామ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కొండం అవినాశ్ తెలిపారు. స్వామివారి తలంబ్రాలు కోరుకునే భక్తులు రూ.151తో బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు లాజిస్టిక్స్ కౌంటర్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించాలని కోరారు.

News April 13, 2024

ములుగు: బీజేపీకి బుద్ధి చెప్పాలి: సీతక్క

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. తన పర్యటనలో భాగంగా గిరిజనులతో కలిసి మంత్రి సీతక్క కాసేపు డోలు వాయించి సందడి చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

News April 12, 2024

హనుమకొండ: పెరిగిన బస్సు ఛార్జీలు!

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని నయీంనగర్ పెద్ద మోరీ వద్ద బ్రిడ్జి నిర్మిస్తున్న సందర్భంగా బస్సులు ములుగు రోడ్డు నుంచి తిరిగి వెళుతున్నాయి. దీంతో బస్సు ఛార్జీలు నేటి నుంచి ఆర్టీసీ అధికారులు పెంచారు. హుజూరాబాద్ నుంచి హనుమకొండకు రూ.50 ఉంటే రూ.10 పెంచి రూ.60 చేశారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రయాణికులపై భారం మోపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News April 12, 2024

జనగామ: ఎండ తీవ్రతకు నెమళ్లు మృతి?

image

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండ నాగారం గ్రామం సమీపంలో ఓ వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పదంగా రెండు నెమళ్లు మృతి చెందిన ఘటన జరిగింది. ఎండ తీవ్రతతో నెమళ్లు మృతి చెందినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 12, 2024

కనీస హక్కులను హరించే దిశగా బీజేపీ అడుగు వేస్తుంది: మంత్రి

image

మనిషి కనీస హక్కులను హరించే దిశగా బీజేపీ అడుగు వేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ, BRS హయాంలో పేద బలహీన వర్గాల మీద అన్యాయం జరిగిందని, ఎన్నికలకు ముందు ED వస్తుంది తర్వాత మోడీ వస్తారని సీతక్క మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో గుంట భూమి ఇచ్చింది లేదని, అదానీ అంబానీలకు మన వనరులని కట్టబెట్టి బడా వ్యాపార నేతలకు మన బతుకులు అప్పగించారని సీతక్క విమర్శించారు.

News April 11, 2024

UPDATE.. HNK: రోడ్డు ప్రమాదంలో 3 నెలల చిన్నారి మృతి

image

HNK జిల్లా ఆత్మకూరు మండలంలో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 నెలల చిన్నారి మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భువనగిరి జిల్లాకు చెందిన శ్రీకాంత్-స్రవంతి దంపతులతో పాటు వారి కూతురు.. ములుగు జిల్లా మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా గుడెప్పాడు వద్ద ఆగిఉన్న లారీని, కారు ఢీకొట్టింది. చిన్నారి అక్కడిక్కడే మృతి చెందిందగా తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి.

News April 11, 2024

హన్మకొండ: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

image

లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ క్రాస్ రోడ్ సమీపంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల ప్రకారం.. హన్మకొండ వైపు నుంచి పరకాల వైపు వెళ్తున్న కారు.. గూడెప్పాడు వద్దకు రాగానే అదుపు తప్పి పక్కనే ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

మంత్రి సీతక్క కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు

image

మంత్రి సీతక్క కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్లంపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త గూడ మండలంలో నేడు మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించుకొని ములుగుకు వస్తుండగా ఈ తనిఖీలు నిర్వహించారు. కాగా, వారికి మంత్రి సహకరించారు.

News April 11, 2024

వరంగల్: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు

image

వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ ఆధ్వర్యంలో నేడు ఐనవోలు మండలం కక్కిరాలపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, వన్నాల శ్రీరాములుతో కలిసి బీజేపీలో చేరారు. వీరికి అరూరి రమేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.