Warangal

News April 5, 2024

ఎనుమాముల మార్కెట్‌కు 5 రోజులు సెలవు

image

వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి సంగయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 5న బాబూజగజ్జీన్‌రామ్ జయంతి, 6, 7 తేదీల్లో వారాంతపు సెలవు, 8న అమావాస్య, 9న ఉగాది సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మార్కెట్ బంద్ ఉంటుందని రైతులు గమనించాలని సూచించారు.

News April 5, 2024

కేయూ పరిధిలో బీపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పరిధిలో బీపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల16 నుండి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి తెలిపారు. 16న పేపర్-1 హిస్టరీ, ప్రిన్సిపుల్స్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, 18న పేపర్-2 అనాటమీ ఫిజియాలజీ, 20న పేపర్ -3ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, 22న పేపర్-4 ఒలింపిక్ మూవ్మెంట్ పరీక్షలు ఉంటాయన్నారు.

News April 5, 2024

పీవీ సొంతూరు రహదారి ఎలా ఉందంటే..?

image

వర్షాకాలం వచ్చిందంటే చాలు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన HNK జిల్లా వంగరలో గ్రామ చెరువు నిండి అలుగు పారుతూ రోడ్డు పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంటుంది. దీంతో రాకపోకలు స్తంభిస్తాయి. అయితే గతంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ వంతెన నిర్మిస్తామని చెప్పినప్పటికీ జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా మంత్రులు చొరవ తీసుకుని వంతెన నిర్మిస్తారని గ్రామస్థులు ఎదురు చూస్తున్నారు.

News April 5, 2024

కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి 

image

హై-టెక్ సిటీలోని అన్నమయ్య సమేత స్వరసిద్ధి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన శిఖర ప్రతిష్ట, కుంభాభిషేకం కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

News April 4, 2024

మహాదేవ్ పూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం బొమ్మపూర్‌లోని పోచమ్మ గుడి సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో సూరారం గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి అక్కడికి మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 4, 2024

హన్మకొండ: ట్రాఫిక్ మళ్లింపు

image

నయీంనగర్ పెద్ద మోరీని ఈనెల 5న అధికారులు కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీని స్థానంలో రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే 3 నెలలపాటు నయీం నగర్ రోడ్డు పై రాకపోకలు బంద్ కానున్నాయని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈనెల 5 నుంచి 3 నెలల పాటు రాకపోకలు పెగడపల్లి డబ్బాల నుంచి హన్మకొండకు వెళ్లాలని అన్నారు.

News April 4, 2024

మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క కుమారుడు

image

మంత్రి సీతక్క కుమారుడు, కాంగ్రెస్ యూత్ నాయకుడు దనసరి సూర్య మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మంగపేట మండలంలో తన పర్యటన ముగించుకొని వస్తున్న నేపథ్యంలో బోరు నరసాపురం గ్రామానికి చెందిన అజ్జు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో స్వయంగా తన వాహనంలో మంగపేట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యులతో సూర్య మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

News April 4, 2024

జనగామ: ఎదురెదురుగా ఢీ కొన్న రెండు కార్లు

image

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి టోల్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
కొందరికి తీవ్ర గాయాలు కాగా.. అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి స్థానికులు తరలించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 4, 2024

వరంగల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి: సీఎం

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థి కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.

News April 4, 2024

వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికంగా ఉష్ణోగ్రతలు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 3గంటల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.