Warangal

News March 31, 2024

హనుమకొండ: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

image

హనుమకొండలోని రెడ్డి కుంట చెరువులో పింగిలి ఇంజినీరింగ్ విద్యార్థి నాగరాజు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని నాగరాజు డెడ్ బాడీని వెతికి తీశామని అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం మృతదేహాన్ని పోలీసు వారికి అప్పగించామన్నారు.

News March 31, 2024

జనగామ: కేసీఆర్ పర్యటన వివరాలు

image

కేసీఆర్ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎండిపోయిన పంటల పరిశీలనలో భాగంగా నేడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరవాత్‌తండాకు రానున్నారు. ఉదయం ఎర్రవల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10.30కు దరవాత్ తండాకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేట జిల్లాకు వెళ్తారు. కేసీఆర్ పర్యటనకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు.

News March 30, 2024

బంగారం కోసం వివాహిత హత్య: డీసీపీ రవీందర్

image

దుగ్గొండి మండలం మైసంపల్లిలో సుప్రియ హత్య ఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నర్సంపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ రవీందర్ వెల్లడించారు. ములుగుకు చెందిన శశికాంత్, అజ్మీర శిరీష సహజీవనం చేస్తున్నారు. వీరి విషయం తెలిసిన మృతురాలు సుప్రియతో శిరీష గొడవ పడింది. ఈనెల 23న సుప్రియను కొట్టి హత్యచేసి బంగారం, వెండిని తీసుకొని పరారయ్యారని తెలిపారు.

News March 30, 2024

ఆనాడు ఎన్టీఆర్‌కు.. ఈనాడు కేసీఆర్‌కు వెన్నుపోటు: MLA

image

కడియం శ్రీహరి ఒక అవకాశవాదని, ఆనాడు ఎన్టీఆర్‌కు.. ఈనాడు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కడియం ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో లేడని, కేసీఆర్‌ను నమ్మి ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీకి నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

News March 30, 2024

ఎర్రబెల్లి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

image

మాజీ మంత్రి ఎర్రబెల్లి కారును శనివారం పోలీసులు తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్‌లో భాగంగా జాఫర్‌గడ్‌లో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అటుగా వెళ్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీ చేశారు. అధికారులకు ఆయన పూర్తి సహకారం అందించినట్లు పేర్కొన్నారు.

News March 30, 2024

WOW.. వెయ్యి గంటల్లో రామప్ప ఆలయాన్ని నిర్మించారు

image

WGL కిట్స్ కళాశాలలోని ఇంజినీరింగ్ విద్యార్థులు ఓ అద్భుతం సృష్టించారు. వెయ్యి గంటల్లో సరికొత్త 3డీ సాంకేతికతతో ఆలయాన్ని అచ్చు గుద్దినట్లు నిర్మించారు. మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రూపేశ్‌కుమార్, అభినయ్, గౌస్‌లు ఈ దీన్ని తయారు చేయగా.. రాజనరేందర్‌రెడ్డి, శ్రీకాంత్, సమీర్‌లు మెంటార్లుగా వ్యవహరించారు. ఐఐటీ HYD వారు నిర్వహించిన ఓ పోటీలో పాల్గొనేందుకు దీన్ని యంత్రంతో ముద్రించారు.

News March 30, 2024

NSPT బస్టాండ్‌లోనే కన్నుమూసిన క్యాన్సర్ బాధితుడు

image

నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోనే ఒకరు మృతి చెందారు. వరంగల్‌కు చెందిన మహ్మద్ అప్జల్(35) నర్సంపేటలో ఓ పండ్ల వ్యాపారి వద్ద కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న అప్జల్ వరంగల్‌కు వెళ్లి వస్తూ నర్సంపేటలో బస్సు దిగాడు. స్పృహ తప్పి బస్టాండులోనే నిద్రపోయాడు. ఆర్టీసి సిబ్బంది వచ్చి అతనిని నిద్రలేపడానికి ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు.

News March 30, 2024

BRSలోకి మాజీ ఎమ్మెల్యే రాజయ్య?

image

కడియం కావ్య కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై BRS దృష్టి సారించింది. ఇటీవలే ఆ పార్టీని వీడిన మాజీ MLA తాటికొండ రాజయ్యను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆయనను WGL అభ్యర్థిత్వానికి పరిశీలిస్తూనే ప్రత్యామ్నాయంపై KCR దృష్టి సారించారట. ఇప్పటికే రాజయ్యతో పార్టీ వర్గాలు సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం.

News March 30, 2024

రేపు దేవరుప్పులకు మాజీ సీఎం కేసీఆర్

image

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల బాట పట్టారు. ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఆదివారం పర్యటించనున్న ఆయన.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. ఆదివారం ఉదయం 8 గంటలకు గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి జనగామ మీదుగా 10.30 గంటలకు దేవరుప్పుల మండలానికి చేరుకుంటారు.

News March 30, 2024

WGL: వయసు చిన్నదే.. ఆశయం పెద్దది

image

తండ్రినే స్ఫూర్తిగా తీసుకొని ఓ కూతురు బాక్సింగ్‌లో రాణిస్తోంది. హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన తనుశ్రీ 8వ తరగతి చదువుతోంది. ఓ పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న తండ్రి శ్యామ్.. కుమార్తెకు శిక్షణ ఇప్పించి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించారు. అంతేకాదు, ఈనెల నోయిడాలో జరిగిన జాతీయ స్థాయి 3వ సబ్ జూనియర్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్యం గెలుచుకుంది. ఈ ఏడాది మేలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననుంది.