Warangal

News March 24, 2024

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్..

image

బీజేపీ వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా ఆరూరి రమేష్ ను పార్టీ అధిష్టానం నియమించింది. 2014, 2018వ సంవత్సరాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరూరి రమేష్ వారం రోజుల క్రితం తన అనుచరులతో కలిసి బిజెపి పార్టీలో చేరారు. మహబూబాబాద్, వరంగల్ ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్, ఆరూరి రమేష్ బీఆర్‌ఎస్ నుంచి బీజేపీ పార్టీలో చేరగానే వారికి ఎంపీ టికెట్ లభించింది.

News March 24, 2024

వరంగల్: ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలి: మంత్రి

image

వరంగల్: హోలీ పండుగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రకృతి ప్రసాదించిన రంగులే మన జీవితంలోని పలు దశలను ప్రతిబింబిస్తాయని, భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని పండుగలా ఆస్వాదించాలనే సందేశాన్ని హోలీ పండుగ ఇస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

News March 24, 2024

వరంగల్: జూపార్క్‌కు త్వరలో పెద్దపులి

image

ఓరుగల్లు వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెద్దపులి త్వరలో సందడి చేయనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండలోని కాకతీయ జూపార్కులో సిద్ధం చేస్తున్నారు. రూ.60 లక్షల వ్యయంతో ఇక్కడ దీనికోసం ప్రత్యేక ఎంక్లోసర్ సిద్ధమైంది. పులికి నివాసయోగ్యమైన అన్నిసౌకర్యాలు కల్పిస్తున్నారు. అడవి వాతావరణం ఉండటం వల్ల అది స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందని జిల్లా అటవీశాఖ అధికారిణి లావణ్య తెలిపారు.

News March 24, 2024

మహబూబాబాద్: తస్లీమాకు 13 రోజుల రిమాండ్

image

అనిశాకు చిక్కిన MHBD సబ్ రిజిస్ట్రార్ తస్లీమాకు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జి.ప్రేమలత తెలిపారు. ఈనెల 16న WGL జిల్లాలో ఏసీబీ న్యాయస్థానాన్ని ప్రారంభించగా.. ఏసీబీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన MHBD సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా, పొరుగు సేవల ఉద్యోగి ఎ.వెంకట్‌ను శనివారం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించగా పోలీసులు వారిద్దరిని కరీంనగర్ జైలుకు తరలించారు.

News March 24, 2024

వరంగల్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం ముంజలకుంటతండాకి చెందిన రమావత్ వెంకన్న కొత్త ఇంటికి అవసరం నిమిత్తం శనివారం మోటార్‌ను బిగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకన్న కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం MGMకు తరలించారు.

News March 24, 2024

పాఠశాల అనుమతి రద్దు చేయాలని ఆర్జేడీకి డీఈవో లేఖ

image

వరంగల్ నగరంలోని కరీమాబాద్ SRR తోట ప్రాంతంలో ఉన్న వాణి విద్యానికేతన్ స్కూల్‌పై వివిధ విద్యార్థి సంఘాలు వినతి పత్రం సమర్పించడంతో డీఈవో వాసంతి స్పందించారు. శనివారం ఆర్జేడీకి ప్రొసీడింగ్ లేఖ పంపించారు. ఒక పర్మిషన్ మీద రెండు బ్రాంచీలు నడిపిస్తున్న వాణి విద్యానికేతన్ పాఠశాల అనుమతి రద్దు చేయాలని ఆర్జేడీకి పంపించారు. ఈ మేరకు AIFDS వామపక్ష విద్యార్థి సంఘాలు డీఈఓకు కృతజ్ఞతలు తెలిపాయి.

News March 24, 2024

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం: మంత్రి సీతక్క

image

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధ్యక్షతన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందన్నారు.

News March 23, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> MHBD ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా సుజాత
> > జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు
> > సీఎం రేవంత్‌ను కలిసిన పాలకుర్తి MLA
> > HNK: బాలికపై లైంగికదాడికి యత్నం.. సీఐ సస్పెండ్
> > గాంధీభవన్ వద్ద దేవరుప్పుల కాంగ్రెస్ నాయకుల నిరసన
> దుగ్గొండి: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
> > ములుగు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి సీతక్క
> ములుగు: వదంతులు సృష్టించిన వ్యక్తిపై కేసు నమోదు

News March 23, 2024

వరంగల్: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

image

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. మైసంపల్లి గ్రామానికి చెందిన వెంగళ సుప్రియ శనివారం సాయంత్రం ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉంది. ఇంట్లో ఉన్న బీరువా పగలగొట్టి ఉన్నట్లు, మృతురాలి మెడలోని బంగారం కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. సుప్రియ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సుప్రియకు భర్త కిరణ్, ఇద్దరు పిల్లలున్నారు.

News March 23, 2024

మహబూబాబాద్ DRDO పురుషోత్తం సస్పెండ్

image

మహబూబాబాద్ DRDOగా పని చేస్తున్న పురుషోత్తంపై సస్పెన్షన్ వేటు పడింది. భూపాలపల్లిలో డీఆర్డీఏ పీడీగా కొనసాగిన సమయంలో రికార్డులను అందజేయకపోవడంపై సమగ్రమైన విచారణ అనంతరం పురుషోత్తం సస్పెండ్ అయ్యారు. డీఆర్డీవోను బాధ్యతల నుంచి తప్పించాలని పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.