India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవరుప్పుల మండలం మాధాపురం గ్రామానికి చెందిన మాచర్ల బిక్షపతి అనే వ్యక్తి బుధవారం అనుమానాస్పదంగా మృతిచెందారు. గ్రామస్థుల వివరాల ప్రకారం రామచంద్రపురం గ్రామంలోని ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అనుమానాస్పదంగా రోడ్డు ప్రక్కన మృతిచెంది పడి ఉన్నాడు. ఈ ఘటన పై దేవరుప్పుల ఎస్సై చెన్నకేశవులను సంప్రదించగా అతనే ప్రమాదవశాత్తూ కింద పడి మృతిచెందాడని తెలిపారు.
ప్రభుత్వ నిషేధిత CPI మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోవాలని ములుగు ఎస్పీ శబరీష్ ప్రకటనలో తెలిపారు. ఆ పార్టీ సిద్ధాంతాలు కాలం చెల్లినవని, వారి భావజాలం ప్రజల్లో ప్రాముఖ్యం కోల్పోయిందని పేర్కొన్నారు. మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదన్నారు.
వచ్చే వానాకాలంలో ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు జూన్- సెప్టెంబరు నెలల మధ్య వర్షాల ప్రభావంపై మంగళవారం HYD వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. గతేడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడం, లెక్కకు మించి వానల విరామ కాలాలు నమోదవడంతో సాగుకు విఘాతం కలిగింది. ఈ సారి ఆ పరిస్థితి ఉండదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ఉపాధ్యాయురాలిని వేధించిన ఘటనలో మరో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేటలోని మోడల్ స్కూల్లో ఈ నెల 10న ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. ఆమె ఆత్మహత్యాయత్నానికి ఉపాధ్యాయుడు రాజేందర్ వేధింపులే కారణమని పంపిన విచారణ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు.
ఈ నెల 6న నిజామాబాద్ నుంచి నర్సంపేటకు వస్తున్న బస్సులో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి(46)ని ఎక్కించారు. అతడి ఆరోగ్యం బాగాలేదని, వరంగల్ వెళ్లాక లేపితే.. అక్కడి నుంచి రైలులో ఆంధ్రా ప్రాంతానికి వెళతారని కండక్టర్ రాజ్‌కుమార్‌కు చెప్పి వారు బస్సు దిగిపోయారు. వరంగల్ చేరుకున్నాక కండక్టర్ లేపడానికి ప్రయత్నించగా..అప్పటికే మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అఖిల భారత సర్వీసులో నియామకాల కోసం UPSC-2023 సివిల్స్ సర్వీసెస్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి సివిల్స్‌లో 104వ ర్యాంక్ సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇంటివద్దనే ఉంటూ నాల్గో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ పొందారు.
రోడ్డు ప్రమాదంలో అరుదైన పాము మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బంగారస్ అనే పాము మృతి చెందింది. ఇటువంటి పామును ఈ ఏరియాలో చూడడం ఇదే మొదటి సారని స్థానికులు తెలిపారు. బంగారస్ అనే పాము ఆసియాకు చెందిన ఎలా పిడ్ల జాతికి చెందిందని, అత్యంత విషపూరిత పామని స్థానిక పశువైద్యులు తెలిపారు.
ములుగు జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున రానున్న పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మల్టీజోన్-1 ఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. ములుగులో ఏర్పాటు చేసిన పోలీస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛతీస్గడ్, ములుగు సరిహద్దు ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ బలగాల ద్వారా ముమ్మర తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీస్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని, అక్రమ నగదు, మద్యం తరలింపుకు అడ్డుకట్ట వేయాలన్నారు.
నేడు విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఓరుగల్లు బిడ్డలు సత్తాచాటారు. జిల్లా నుంచి ముగ్గురు సివిల్స్ సర్వీసుకు ఎంపికయ్యారు. వరంగల్ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు, గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ 568వ ర్యాంకు, శివనగర్‌కు చెందిన కోట అనిల్ కుమార్ 764 ర్యాంకు సాధించారు. వీరిలో జయసింహారెడ్డికి ఐఏఎస్, కిరణ్‌కు ఐపీఎస్, అనిల్ కుమార్‌కు ఐఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది.
వడ్డీ వ్యాపారులు ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-1 ఐజీ ఏవీ రంగనాథ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొంత మంది వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డబ్బు చెల్లించని వారి నుంచి బలవంతంగా ఇల్లు, పొలాల పత్రాలను తీసుకుంటున్నట్లుగా ఫిర్యాదులు అందాయన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.