Warangal

News April 16, 2024

వరంగల్: రూ.5 పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర రూ.5 పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,100 పలకగా.. ఈరోజు రూ.7105 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. అయితే పత్తి ధరలు భారీగా పడిపోతుండటంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని ఆవేదన చెందుతున్నారు.

News April 16, 2024

వరంగల్: సమన్వయకర్తలను నియమించిన కేటీఆర్

image

వరంగల్ పార్లమెంట్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించారు. పరకాలకు బండ ప్రకాష్ ముదిరాజ్, పాలకుర్తి సిరికొండ మధుసూదనాచారి, మెట్టు శ్రీనివాస్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్‌కు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేటకు వాసుదేవరెడ్డి, సమ్మరావు, భూపాలపల్లికి బసవరాజు సారయ్యను నియమించారు.

News April 16, 2024

WGL: కానిస్టేబుల్ జాబ్ రాలేదని యువకుడు ఆత్మహత్య

image

కానిస్టేబుల్ ఉద్యోగం దక్కడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దేవేందర్ గౌడ్, భారతీ దంపతుల కుమారుడు రంజిత్ డిగ్రీ పూర్తి చేసి 2022 నుంచి కానిస్టేబుల్ పరీక్షలు రాస్తున్నాడు. ఫిజికల్ టెస్టులు అర్హత సాధించినప్పటికీ రాత పరీక్షలు వెనుక పడిపోవడంతో మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News April 16, 2024

WGL: గుండెపోటుతో కారోబార్ మృతి

image

గుండెపోటుతో కారోబార్ మృతి చెందిన ఘటన పాలకుర్తిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన కారోబార్ పోగు అయోధ్య రాములు (56)సోమవారం పాలకుర్తిలో విధులకు వచ్చి గుండె నొప్పి వచ్చింది. అతన్ని ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకుడు కోడం కుమారస్వామి డిమాండ్ చేశారు.

News April 16, 2024

WGL: రామయ్యకు రెండు సార్లు పెండ్లి

image

లింగాల ఘన్పూర్ మండలం జీడికల్‌‌‌‌లోని వీరాచల రామచంద్రస్వామి ఆలయం రెండో భద్రాద్రిగా పేరుగాంచింది. జిల్లా కేంద్రానికి13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో ఏటా రెండు సార్లు రాములోరి కల్యాణం జరుగుతుంది. శ్రీరామనవమితో పాటు కార్తీకమాసంలోని పునర్వసు నక్షత్రంలో ఇక్కడ కల్యాణ వేడుకలు వైభవంగా జరుగుతాయి. భద్రాచలంలోని ఆలయం రాముడి ప్రేమకు ప్రతీకగా చెప్పుకుంటే జీడికల్‌‌‌‌లో రాముడిని వీరత్వానికి ప్రతీకగా చెప్తుంటారు.

News April 16, 2024

WGL: ఆన్ లైన్‌లో రాములవారి తలంబ్రాలు

image

భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందండి. ఆఫ్లైన్‌లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లపై 040-23450033ను సంప్రదించాలన్నారు.

News April 15, 2024

పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: కేటీఆర్

image

వరంగల్‌లో చివరి క్షణంలో కడియం కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి బీఆర్ఎస్ గెలుపు కోసం కదం తొక్కాలని అన్నారు.

News April 15, 2024

హనుమకొండలో అమానుష ఘటన

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో అమానుష ఘటన వెలుగుచూసింది. గోపాలపురం చెరువులో సోమవారం పసికందు మృతదేహం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మగశిశువు మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించిందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ పారేసి ఉంటారని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు శిశువు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

News April 15, 2024

5కె రన్ వాయిదా: జిల్లా కలెక్టర్

image

హనుమకొండ జిల్లాలో ఓటరు చైతన్యంపై రేపు (మంగళవారం) ఉదయం 6 గంటలకు నిర్వహించే 5కె రన్‌ను అనివార్య కారణాలవల్ల వాయిదా వేయడం జరిగిందని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన తదుపరి తేదీని, విషయాలను త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు.

News April 15, 2024

డీఎస్సీ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ, వరంగల్ జిల్లా ద్వారా DSCఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకొనుటకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాలో గల షెడ్యూల్డు కులాల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల అధికారి భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. బీఎడ్ లేదా డైట్ నందు అర్హత సాధించిన SC విద్యార్థులందరూ అర్హులన్నారు. వివరాలకు 9346374583 నంబర్‌ను సంప్రదించాలన్నారు.