India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హనుమకొండలోని పెద్దమ్మగడ్డ ఎస్సారెస్పీ కెనాల్ కట్ట పైన ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
లభ్యమయిందని హనుమకొండ పోలీస్‌స్టేషన్ సీఐ సతీశ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు బీకే, ఏఎస్ఆర్ కమిటీ ఆజాద్ పేరుతో ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తుంది. బూటకపు ఎన్‌కౌంటర్లకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ములుగు జిల్లా ఎస్పీ కనుసనల్లోనే ఈ ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతోందన్నారు. పూజార్ కాంకేర్ మృతులకు లాల్ సలాం అంటూ లేఖలో పేర్కొన్నారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ములుగు ఎస్పీ ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డాడని లేఖలో వివరించారు.
విద్యుత్తు పనులు చేస్తుండగా షాక్‌తో వ్యక్తి మృతిచెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగింది. తీగారం గ్రామానికి చెందిన బైకాని శ్రీశైలం శనివారం ముత్తారం గ్రామశివారులో విద్యుత్తు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌తో మరణించాడు. ఇతను వల్మిడిలో విద్యుత్తు కట్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో మహిళ పనిచేస్తుండగా.. అందులో సెక్రటరీగా పనిచేస్తున్న వెలుగు మురళి వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొన్నిరోజులుగా మహిళపై మనసుపడ్డానని మురళి ఆమెను వేధించేవాడు. తాజాగా అవి ఎక్కువవడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో మురళిపై SC, ST కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.
ములుగు జిల్లా-చతీస్‌ఘడ్ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య శనివారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ ములుగు జిల్లా పరిధిలోని తెలంగాణ బార్డర్‌లో జరిగింది.
మారుమూల ప్రాంతంలో పుట్టి ఫెన్సింగ్ అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తోంది కాటారం మండల కేంద్రానికి చెదిన దేవరకొండ దీక్షిత. ప్రస్తుతం HYD స్పోర్ట్స్ స్కూల్‌లో ఇంటర్ చదువుతూ.. పంజాబ్‌లోని పటియాలలో ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ పొందుతున్నారు. అంతేకాదు, పారిస్‌లో జరిగిన విదేశీ శిక్షణకు ఎంపికై గత డిసెంబర్లో 15రోజుల పాటు శిక్షణ పూర్తి చేశారు. దేశం తరఫున ఆడి బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం వద్ద పర్యాటకులను ఆకట్టుకునేలా వివిధ సొబగులను దిద్దుతున్నారు. రూ.40లక్షల వ్యయంతో జలపాతం ఎదురుగా వాచ్ టవర్, 14 బల్లాలను, బండరాళ్లతో నడక దారి పనులు చేస్తున్నారు. వంటలు చేసుకునేలా గదులు, బోరు, దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశారు. పర్యాటకుల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన హసన్‌పర్తి మండలంలో చోటుచేసుకుంది. SI అశోక్ ప్రకారం.. ఆరెపల్లికి చెందిన యాద రాకేశ్(24).. ఎల్కతుర్తిలోని బంధువుల పెళ్లికి స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ఇంటికి వచ్చి మళ్లీ పెళ్లికి వెళ్తుండగా.. అనంతసాగర్ శివారులో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల కోసం ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో వరంగల్ జిల్లాకు సంబందించిన గ్రాడ్యుయేట్స్ ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 43,594 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో 26,907 మంది పురుషులు, 16,687 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
వరంగల్ జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఈనెల 7న పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈవో డాక్టర్ ఎండి.అబ్దులై తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని మూడు మోడల్ స్కూళ్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.