Warangal

News April 6, 2024

WGL: మూడు నెలల్లో వంతెన పూర్తి: MLA

image

HNK-KNR ప్రదాన రహదారిలోని నయీంనగర్ నాలాపై పాత వంతెన కూల్చే పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా MLA నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 3 నెలల్లో కొత్త వంతెన పనులను పూర్తి చేస్తామని అన్నారు. గత ఐదేళ్లుగా నాలాను ఆనుకొని ఉన్న కాలనీలు వర్షాకాలంలో ముంపునకు గురవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారంగా కొత్త వంతెన నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

News April 6, 2024

తెర వెనుక ఏమి జరుగుతుందో నేటి యువత తెలుసుకోవాలి: చంద్ర కుమార్

image

కేయూ సెనెట్ హాల్‌లో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని శుక్రవారం విశ్వవిద్యాలయ SC/ST సెల్ సంచాలకులు డాక్టర్ టి.రాజమణి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా “కాంటెంపరరీ ఇష్యూస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ” అనే అంశంపై కీలక ఉపన్యాసం చేసి మాట్లాడారు. అనంతరం రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ.. తెర వెనుక ఏమి జరుగుతుందో నేటి యువత తెలుసుకోవాలన్నారు.

News April 5, 2024

కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల 

image

2023 డిసెంబరులో నిర్వహించిన కేయూ డిగ్రీ (బి.ఎ/బి.కాం/బి.ఎస్.సి/బిబిఎ/హనర్స్/వొకేషనల్) 1వ, 3వ,5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ రమేశ్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 24.41% ఉత్తీర్ణత, 3వ సెమిస్టర్ పరీక్షల్లో 30%, 5వ సెమిస్టర్ పరీక్షల్లో 44.45% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. వివరాలకు www.kakatiya.ac.inలో చూడవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి తెలిపారు. 

News April 5, 2024

వరంగల్ NITలో ప్రముఖ సింగర్ హరిచరణ్

image

హనుమకొండ జిల్లా కాజీపేట సమీపంలోని నిట్ క్యాంపస్‌లో శుక్రవారం స్ప్రింగ్ స్ప్రీ ఘనంగా ప్రారంభమైంది. శనివారం రాత్రి ఘనంగా ప్రో షో నిర్వహించారు. ఈ షోలో ప్రముఖ సింగర్లు హరిచరణ్, శిరీష పాటలు పాడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. వారు పాటలు పాడుతున్నంత సేపు విద్యార్థులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. 

News April 5, 2024

బడుగు వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ కృషి: NIT డైరెక్టర్

image

భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ 117వ జయంతి సందర్భంగా NIT వరంగల్‌ డైరెక్టర్, ప్రొఫెసర్ విద్యాధర్ సుబుధి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా NIT  డైరెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ తన జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో NIT వరంగల్ సిబ్బంది పాల్గొన్నారు.

News April 5, 2024

వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం BRS కసరత్తు

image

వరంగల్ MP అభ్యర్థి కోసం BRS కసరత్తు చేస్తుంది. మొదట్లో కడియం కావ్యకు టికెట్ ఇవ్వగా నిరాకరించి హస్తం గూటికి చేరారు. దీంతో మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి BRSలో ఏర్పడింది. మాజీ MLA తాటికొండ రాజయ్యని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి వరంగల్ నుంచి పోటీకి దింపాలని BRS నేతలు మంతనాలు జరుపుతున్నారు. అలాగే మాజీ MLA పెద్ది సుదర్శన్ సతీమణి స్వప్న, జోరిక రమేశ్ టికెట్ పట్ల ఆసక్తిగా ఉన్నారు.

News April 5, 2024

వరంగల్ RDO ఆఫీసు జప్తు

image

తెలంగాణ హైకోర్టు తీర్పుతో వరంగల్ RDO ఆఫీసును అధికారులు జప్తు చేశారు. గీసుకొండ మండలం శాయంపేట సమీపంలో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ పార్క్ కోసం భూమి ఇచ్చిన నిర్వాసితులకు పరిహారం అందలేదు. దీనిపై రైతు సముద్రాల స్వామి, అతడి కూతురు వెన్నెల హైకోర్టును ఆశ్రయించారు. పరిహారం ఇవ్వాలని గతంలో ఇచ్చిన తీర్పును పట్టించుకోకపోవడంతో RDO ఆఫీసు జప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

News April 5, 2024

కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: MLA

image

కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. వేలేరు మండలంలోని షోడషపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారిన నేతలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

News April 5, 2024

జనగామ: ప్రేమ పేరుతో మోసం.. వ్యక్తి పై కేసు

image

ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు SI రాజు తెలిపారు. లింగాలఘనపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు నాలుగేళ్లుగా ప్రేమ పేరుతో కలిసి ఉంటున్నారు. ఆమెను మోసగించి ఇటీవల మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 5, 2024

ఎనుమాముల మార్కెట్‌కు 5 రోజులు సెలవు

image

వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి సంగయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 5న బాబూజగజ్జీన్‌రామ్ జయంతి, 6, 7 తేదీల్లో వారాంతపు సెలవు, 8న అమావాస్య, 9న ఉగాది సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మార్కెట్ బంద్ ఉంటుందని రైతులు గమనించాలని సూచించారు.